మధ్యప్రదేశ్(Madhya pardesh)లోని సాగర్(sagar) ప్రాంతానికి చెందిన ముఖేశ్ పటేల్(Mukesh Patel), నేహా(Neha) దంపతులకు ఏడాది వయసున్న కొడుకుకు తీవ్ర అనారోగ్యం. మూడు నెలల వయసున్నప్పుడే గుండెలో చిన్న చిల్లు ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి కొడుకుకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.
మధ్యప్రదేశ్(Madhya pardesh)లోని సాగర్(sagar) ప్రాంతానికి చెందిన ముఖేశ్ పటేల్(Mukesh Patel), నేహా(Neha) దంపతులకు ఏడాది వయసున్న కొడుకుకు తీవ్ర అనారోగ్యం. మూడు నెలల వయసున్నప్పుడే గుండెలో చిన్న చిల్లు ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి కొడుకుకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. రోజువారీ కూలీ అయిన ముఖేశ్‌కు ఇది తలకు మించిన భారమే! ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలంటే ఓ ఆపరేషన్ చేయాలని, అందుకు మూడున్నర లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బు ఎక్కడ్నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు. తెలిసివారినందరినీ అడిగారు.. అభ్యర్థించారు. అయినా ఎవరూ సాయం చేయలేదు. ఏం చేయాలో, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక నిద్రపట్టని రాత్రులను గడిపారా దంపతులు.
అప్పుడు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడకి ముఖేశ్, నేహాలు కూడా వెళ్లారు. తమ బాధను, సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ చౌహాన్ దగ్గరకు వెళ్లడానికి భద్రతాసిబ్బంది ఒప్పుకోలేదు. అప్పటికే ముఖేశ్ నిర్వేదానికి గురయ్యారు. తీవ్రమైన ఆవేదనతో ఆ తండ్రి ఎవరూ ఒడిగట్టని సాహసానికి పాల్పడ్డాడు. వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా తన ఏడాది వయసున్న కొడుకును అక్కడకు విసిరేశాడు. దీంతో అక్కడున్నవారు షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ చిన్నారిని రక్షించి తల్లికి అప్పగించారు. ఆ తండ్రి అలా చేయడానికి కారణమేమిటో ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. చిన్నారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు..