☰
✕
సంతానం కోసం సప్త సముద్రాలు మునిగితే ఉప్పు నీళ్లు తగిలి ఉన్నది కాస్తా ఊడిందన్నది సామెత!
x
సంతానం కోసం సప్త సముద్రాలు మునిగితే ఉప్పు నీళ్లు తగిలి ఉన్నది కాస్తా ఊడిందన్నది సామెత!అట్టాగే సంతానం కోసం ఒక మంత్రగాడు చెప్పిన మాట విని ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగాడు. మింగిన వాడు చనిపోయాడు. లక్కీగా కోడిపిల్ల బతికింది. వివరాల్లోకి వెళితే 35 ఏళ్ల ఆనంద్ యాదవ్(Anand Yadav) అనుమానాస్పద స్థితిలో స్పృహ కోల్పోయాడు. వెంటనే గ్రామస్తులు అతడిని అంబికాపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. అప్పటికే ఆనంద్ చనిపోయాడు. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు గొంతులో ప్రాణంతో ఉన్న కోడిపిల్ల ఇరుక్కుందని డాక్టర్ లు గుర్తించారు. 20 సెంటి మీటర్ల పొడవున్న కోడిపిల్ల ఆనంద్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఊపిరి ఆడక చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.
ehatv
Next Story