బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్(Hrithik roshan) పాత్రను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నాడు.

బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్(Hrithik roshan) పాత్రను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నాడు. ఓ వ్యక్తి భోపాల్‌ మ్యూజియం(Bhopal museum) నుంచి ₹ 15 కోట్ల విలువైన బంగారాన్ని(Bangaram) దొంగిలించడానికి ప్రయత్నించాడు. భోపాల్‌లోని స్టేట్ మ్యూజియంలో దొంగ అపస్మారక స్థితిలో దొరికాడు. అతని దగ్గర పురాతన బంగారు నాణేలు(Gold coins), నగలు వంటి అమూల్యమైన కళాఖండాలు ఉన్నాయి. వృత్తిరీత్యా దొంగగా భావిస్తున్న వినోద్ యాదవ్ ఆదివారం సాయంత్రం టిక్కెట్ తీసుకుని మ్యూజియంలోకి ప్రవేశించి మ్యూజియం మూసే వరకు లోపలే దాక్కున్నాడు. సోమవారం మ్యూజియాన్ని మూసివేశారు. ఈ సమయంలో యాదవ్ రెండు గ్యాలరీ గదుల్లోకి చొరబడి కళాఖండాలను దొంగిలించాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మ్యూజియాన్ని తిరిగి తెరిచినప్పుడు పగిలిన అద్దాలు, పలు విలువైన వస్తువులు మాయమైనట్లు సిబ్బంది గుర్తించారు. మ్యూజియం భద్రతా సిబ్బంది పరిసరాల్లో వెతికారు. ఈ సమయంలో వినోద్‌ యాదవ్‌ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. అతని పక్కనే ఉన్న బ్యాగులో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలు, నగలు, పాత్రలతో పాటు బ్రిటీష్, నవాబుల కాలానికి చెందిన ఇతర వస్తువులు ఉన్నాయి. 23 అడుగులకుపైగా ఎత్తు నుంచి వినోద్‌ యాదవ్‌ పడిపోయి ఉంటాడని, దీంతో అతని కాలికి గాయమై కదల్లేని స్థితిలో ఉండిపోయాడు. ఘటనస్థలికి చేరుకన్న పోలీసులు విచారణ చ ఏపట్టారు.

కేసు వివరాలను డీసీపీ రియాజ్‌ ఇక్బాల్‌ వివరించారు. నిందితుడు గోడ దూకేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది, అతనికి గాయం కావడంతో కదల్లేక అక్కడే ఉండిపోయాడని పోలీసులు తెలిపారు. మ్యూజియం నుంచి దాదాపు 50 వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో ఒక్కొక్కటి 50 నుంచి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలు ఉన్నాయి. వాటి విలువ ₹ 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. డిసిపి ఇక్బాల్ మాట్లాడుతూ, రికవరీ చేసిన వస్తువుల మొత్తం విలువ సుమారు ₹ 15 కోట్లు ఉంటుందని.. మొత్తం మ్యూజియంలో ₹ 50 కోట్ల కంటే ఎక్కువ విలువైన కళాఖండాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో మ్యూజియం భద్రతపై ఆందోళన నెలకొంది. ఇందులో అలారం వ్యవస్థ లేకపోవడం, చాలా CCTV కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. ఇన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ దొంగతనాన్ని అరికట్టడంలో సెక్యూరిటీ గార్డుల అప్రమత్తత కీలక పాత్ర పోషించింది. తాను చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం చేశానని, అయితే గార్డులు నిరంతరం పెట్రోలింగ్ చేయడం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చిందని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

Eha Tv

Eha Tv

Next Story