క‌ర్నాటక(Karnataka)లోని చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి మ‌రొక‌ వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగుతుండగా.. నిందితుడు స్నేహితుడు ఈ ఘటనను తన మొబైల్‌లో బంధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేష్ అనే వ్య‌క్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో విజయ్ అనే వ్య‌క్తి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. జూన్ 19న విజయ్..

క‌ర్నాటక(Karnataka)లోని చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి మ‌రొక‌ వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగుతుండగా.. నిందితుడు స్నేహితుడు ఈ ఘటనను తన మొబైల్‌లో బంధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారేష్ అనే వ్య‌క్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో విజయ్ అనే వ్య‌క్తి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. జూన్ 19న విజయ్.. మారేష్‌ను సమీపంలోని అడవికి తీసుకెళ్లి అతనిపై దాడి చేశాడు. విజ‌య్ వెంట‌ అడ‌వికి వెళ్లిన అత‌ని స్నేహితుడు జాన్.. తన మొబైల్ ఫోన్‌లో ఆ భ‌యంక‌ర దృశ్యాల‌ను రికార్డ్ చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు మారేష్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. మారేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌ని అరెస్ట్ చేశారు.

Updated On 26 Jun 2023 12:55 AM GMT
Ehatv

Ehatv

Next Story