మోసం చేయడం కూడా ఓ కళే! అందులో మాస్టర్స్ చేసిన వారు ఎలాంటి వారినైనా ఇట్టే బుట్టలో దింపేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ వినోద్‌బాబునే తీసుకోండి.. ఇతగాడు ఏకంగా ముఖ్యమంత్రినే బురిడి కొట్టించాడు. సీఎం ఏమిటీ? మంత్రులు కూడా అతడిని గుడ్డిగా నమ్మేసి కొంత సొమ్మును సమర్పించుకున్నారు. వినోద్‌బాబు ఎవరనేగా మీ డౌటు? తమిళనాడు రామనాథపురం జిల్లా కడలాడి తాలూకా కీళచెల్వనూర్‌కు చెందిన ఇతడు దివ్యాంగుడు. భారత వీల్‌ఛైర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అని చెప్పుకుంటుంటాడు.

2022లో తన సారథ్యంలోని టీమిండియా ఆసియా కప్ గెలిచిందని టముకేసుకున్నాడు. అలా చెప్పుకునే తమిళనాడు మంత్రులు రాజకన్నప్పన్, ఉదయనిధి స్టాలిన్‌లను కలిశాడు. లాస్ట్ వీక్ లండన్‌లో జరిగిన టీ-20 ప్రపంచకప్‌లో విజయం సాధించామంటూ ఓ కప్‌తో సీఎం స్టాలిన్, మంత్రి రాజకన్నప్పన్‌ను కలిశాడు. ఇతడు చెప్పేదంతా అబద్ధమని సెక్రటేరియట్‌కు కబురొచ్చింది. వెంటనే ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. వినోద్‌బాబు అనే వాడు టీమ్‌లోనే లేడని, అతగాడికి పాస్ పోర్ట్ కూడా లేదని దర్యాప్తులో తేలింది. కల్లబొల్లి మాటలతో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడని తెలిసింది. పాపం ఇతడిని పూర్తిగా నమ్మేసిన ఓ బెకరీ ఓనర్ లక్ష రూపాయలు ఇచ్చాడట. మంత్రులు కూడా అంతో ఇంతో సమర్పించుకున్నారట. ఇతడిపై రామనాథపురానికి చెందిన ఏబీజే మిస్సైల్స్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శరవణకుమార్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ప్రస్తుతం వినోద్‌బాబు పోలీసుల అదుపులో ఉన్నాడు.