ప్రభుత్వ పథకాల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో అప్పటికే పెళ్లయిన సోదరిని(Sister) అందరి ఎదుట ఆమె సోదరుడు(Brother) పెళ్లి చేసుకున్నాడు.
ప్రభుత్వ పథకాల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో అప్పటికే పెళ్లయిన సోదరిని(Sister) అందరి ఎదుట ఆమె సోదరుడు(Brother) పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సామూహి క వివాహ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంట్లో బోల్డన్ని అవకతవకలు జరుగుతున్నాయి. అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పథకం కింద పెళ్లి చేసుకున్న దంపతులకు గృహోపకరణాలతో పాటు 35 వేల రూపాయల నగదును అందిస్తారు. మహారాజ్ గంజ్ జిల్లాలో ఓ వివాహితను మళ్లీ చేసుకోవడానికి కొందరు ఒప్పించారు. అయిష్టంగానే ఆమె ఒప్పుకుంది. అయితే ముహూర్తపు సమయానికి వాళ్లు మాట్లాడుకున్న వరుడు రాలేదు. పెళ్లి కాకపోతే ప్రభుత్వ లబ్ధిని పొందలేమన్న ఉద్దేశంతో ఆ వివాహిత సోదరుడితో ఆమెకు పెళ్లి చేశారు.