తండ్రి(Father) సాధారణ మరణం చెందితే తండ్రి ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ(Government) శాఖలో అడుగుపెడతాడు.. అంతేకానీ కన్న తండ్రిని చంపితే ఆ ప్రభుత్వం ఉద్యోగం(Government Job) ఎలా వస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలోనే అడుగుపెడతాడు.. కానీ జైళ్ల శాఖలో సుమా..! ఓ కొడుకు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు?

ఉద్యోగం కోసం తన, మన ఏదీ లేదు. తన తండ్రిని హతమారిస్తే ఉద్యోగం వస్తుందని భావించాడు. ఉద్యోగం కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి పెంచి పెద్ద చేసిన కన్న తండ్రినే కడ తేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లో(Jharkhand) జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం జార్ఖండ్‌లోని రాంఘడ్(Ramghad) జిల్లాలో రామ్‌జీ ముండా అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ (CCF)లో రామ్‌జీ జాబ్ చేస్తున్నాడు. రామ్‌జీ ముండాకు ఓ కొడుకు నిరుద్యోగిగా ఉన్నాడు. తన కొడుకు నిరుద్యోగమే తన ప్రాణాలను హరిస్తుందని రామ్‌జీ(Ramji) ఊహించలేకపోయాడు. అయితే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఆకస్మత్తుగా చనిపోతే, ఆ ఉద్యోగం కుటుంబసభ్యుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వడం సాధారణం. కానీ ఇక్కడ ఓ కసాయి కొడుకు తండ్రిని చంపిస్తే ఆ ఉద్యోగం తనకు వస్తుందని పన్నాగం వేశాడు. ఇంకేం ఉంది కిరాయి హంతకులను రంగంలోకి దించాడు. ఇందుకోసం ఓ కిరాయి హంతకుడితో కాంట్రాక్ట్(Contract Killer) కుదుర్చుకున్నాడు. ఈనెల 16న రామ్‌జీ బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రామ్‌జీని రాంఘడ్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాంచీలోని పెద్దాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, రామ్‌జీ హత్యాయత్నం వెనుక కుట్రపై విచారించారు. ఈ కుట్రలో రామ్‌జీ కొడుకు హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు రామ్‌జీ కొడుకు అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.