మనవాళ్లకు బొత్తిగా ట్రాఫిక్‌ సెన్స్‌ ఉండదు.. రోడ్లపై ఇష్టారాజ్యాంగా వాహనాలు నడిపే వారు లెక్కలేనంత మంది ఉంటారు. అందుకే దేశంలో రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ట్రాఫిక్ రూల్స్‌ను విధించాయి.

మనవాళ్లకు బొత్తిగా ట్రాఫిక్‌ సెన్స్‌ ఉండదు.. రోడ్లపై ఇష్టారాజ్యాంగా వాహనాలు నడిపే వారు లెక్కలేనంత మంది ఉంటారు. అందుకే దేశంలో రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు(Road accidents) జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ట్రాఫిక్ రూల్స్‌ను విధించాయి. ఈ నిబంధనలను ఎవరైనా బ్రేక్‌ చేస్తే ఫైన్‌ కట్టాల్సి(Chalan) ఉంటుంది. మన దగ్గర ఇలా పెండింగ్‌ చలాన్లు ఉన్న వాహనదారులు చాలా మందే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి వారు కొంచెం ఎక్కువగా ఉంటారు.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Prdesh) గోరఖ్‌పూర్‌(Gorakhpur) ట్రాఫిక్‌ పోలీసులు(Traffic Police) అత్యధిక చలాన్లు పొందిన పది వాహనాల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఓ వ్యక్తి ఏడాదిన్నర కాలంలో 70 చలాన్లు అందుకుని ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచాడు. ఈ ఏడాదిలో అతడు 33 చలాన్లు అందుకోగా, నిరుడు 37 చలాన్లు అందుకున్నాడు. ఫలితంగా 85 వేల రూపాయలు విలువ చేసే అతడి వాహనంపై ఇప్పటి వరకు 70 వేల 500 రూపాయల చలాను పడింఇ.

ఈ జాబితాలో మరో తొమ్మిది మంది కూడా ఎక్కువ చలాన్లు అందుకున్నారు. వీరిలో కొందరికి ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసినందుకు 50 కంటే ఎక్కువ సార్లు ఫైన్‌ పడింది. గోరఖ్‌పూర్‌ పోలీసులు రోడ్డు భద్రతకు చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు సిగ్నల్‌ నిబంధనలను ఉల్లంఘించే వాహనాల నంబర్‌ప్లేట్లను క్యాప్చర్‌ చేస్తాయి. వాటి ఆధారంగానే పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. ఫైన్‌ కట్టనివారి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

Updated On 22 Jun 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story