జీవితంలో మొదటి సారి ఓటు(First Vote) హక్కు రావడంతో ఆ కుర్రాడు తెగ సంబరపడ్డాడు. తాను ఓటు వసే ఆ సందర్భం జీవితాంతం గుర్తుండాలని, పది మంది చెప్పుకునేట్టుగా ఉండాలని అనుకున్నాడు.
జీవితంలో మొదటి సారి ఓటు(First Vote) హక్కు రావడంతో ఆ కుర్రాడు తెగ సంబరపడ్డాడు. తాను ఓటు వసే ఆ సందర్భం జీవితాంతం గుర్తుండాలని, పది మంది చెప్పుకునేట్టుగా ఉండాలని అనుకున్నాడు. వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి(Polling Booth) వెళితే భేషుగ్గా ఉంటుందని భావించి దున్నపోతుపై(Bull) పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. చక్కగా ఓటు వేశారు. బీహార్‌లోని ఉజియార్‌పూర్(Ujiarpur) లోక్‌సభ స్థానంలో ఈ చిత్రమైన ఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడు నల్ల చొక్కా, గ్రే కలర్ ప్యాంట్ ధరించి, తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి వెళుతుంటే అందరూ వింతగా చూశారు. అన్నట్టు దున్నపోతుకు తలకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు. అతడు దున్నపోతు మీద వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది చూసి నెటిజన్లు తలో తీరుగా స్పందిస్తున్నారు.