రాజస్తాన్‌లోని(Rajasthan) బాలొత్రా(Balotra) గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి.
రాజస్తాన్‌లోని(Rajasthan) బాలొత్రా(Balotra) గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిల్లో దాడుల కేసులే ఎక్కువ. పోలీసులు బాబురామ్ భిల్‌ను పట్టుకుని ఎందుకిలా దాడులు చేస్తున్నావని అడిగారు. దానికి బాబురామ్ చెప్పిన సమాధానం విని ఖాకీలు తెల్లమొహం వేశారు.
తాను బతికే ఉన్నానని చాటుకోవడానికే దాడులు చేస్తున్నానని చెప్పడంతో నిర్ఘాంతపోయారు పోలీసులు. 'నేను చనిపోయినట్టు సర్టిఫికెట్(Death certificate) జారీ అయ్యింది. అది చూసి నేను షాకయ్యాను. నా ఆస్తిని గుంజుకోవడం కోసమే దొంగ సర్టిఫికెట్ తయారు చేశారు. మరి నేను బతికే ఉన్నానని ఎలా చెప్పుకోవడం? సమాజానికి నేను బతికే ఉన్నానని తెలియాలిగా! అందుకే దాడులు చేస్తున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. అప్పుడందరికీ నేను బతికే ఉన్నానని తెలుస్తుంది కదా' అని బాబురామ్ భిల్ చెప్పుకొచ్చాడు. బతికున్నట్టు సర్టిఫికెట్ ఎలా సంపాదించడం ఎలాగో పాపం బాబురామ్‌కు తెలియదు. మన దేశంలో బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకెక్కిస్తున్నారు. ఇందులో అవినీతితో పాటు, ప్రభుత్వ అధికారుల అలసత్వం కూడా ఉంది.