వెర్రి వేయివిధాలని పెద్దలు ఊరికే అనలేదు. హర్యానాలో(Haryana) ఓ వ్యక్తి చేసిన పనిని పిచ్చానాలో, ఏమనాలో తెలియడం లేదు. గురుగ్రామ్‌లోని(Gurugram) సైబర్‌సిటీ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్సు రోడ్డులో(Golf Course Road) ఓ వ్యక్తి కారులో వెళుతూ కారు డోర్ నుంచి బయటకు వచ్చి కారు పైకప్పుపై టపాసులు పెట్టి కాల్చాడు.

Crackers Burst From Car Top
వెర్రి వేయివిధాలని పెద్దలు ఊరికే అనలేదు. హర్యానాలో(Haryana) ఓ వ్యక్తి చేసిన పనిని పిచ్చానాలో, ఏమనాలో తెలియడం లేదు. గురుగ్రామ్‌లోని(Gurugram) సైబర్‌సిటీ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్సు రోడ్డులో(Golf Course Road) ఓ వ్యక్తి కారులో వెళుతూ కారు డోర్ నుంచి బయటకు వచ్చి కారు పైకప్పుపై టపాసులు పెట్టి కాల్చాడు. ఈ దృశ్యాలను వెనుక వస్తున్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. తను చేస్తున్నది చట్టవిరుద్ధమైన పని అని తెలుసు కాబట్టే అతగాడు కారు నంబర్ ప్లేట్‌ను తెలివిగా తొలగించాడు. వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
