కేంద్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని(INDIA Alliance) ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటమిలో కొన్ని పార్టీలు చేరడానికి సంకోచిస్తున్నాయి. అటు ఎన్టీయే(NDA) కూటమిలోనూ, ఇటు ఇండియా కూటమిలోనూ లేని పార్టీలు చాలానే ఉన్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP), బీఆర్‌ఎస్‌లు(BRS) తాము ఎటువైపో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు.
కేంద్రంలో బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని(INDIA Alliance) ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కూటమిలో కొన్ని పార్టీలు చేరడానికి సంకోచిస్తున్నాయి. అటు ఎన్టీయే(NDA) కూటమిలోనూ, ఇటు ఇండియా కూటమిలోనూ లేని పార్టీలు చాలానే ఉన్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP), బీఆర్‌ఎస్‌లు(BRS) తాము ఎటువైపో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఈ రెండు పార్టీలు మోదీ(Narendra Modi) కన్నుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది కొందరి అనుమానం! ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో చేరాల్సిందిగా బహుజన్ సమాజ్‌పార్టీ (BSP)ను కూడా రిక్వెస్ట్ చేశారు. తాము కూటమిలో చేరాలంటే మాయావతిని(Mayawati) ప్రధానమంత్రి అభ్యర్థిగా(PM Candidate) ప్రకటించాలని ఇండియా కూటమికి షరతు విధించారు బీఎస్పీ నేతలు. ఇండియా కూటమికి బీజేపీని ఓడించాలనే సంకల్పం ఉంటే మాత్ర మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని, ఇది జరగకపోతే మాత్రం బీజేపీని ఓడించడం అసాధ్యమని బీఎస్పీ ఎంపీ మలక్‌నగర్ అన్నారు. మోదీని నిలువరించాలంటే కూటమిలో బీఎస్పీని చేర్చుకోక తప్పదు. ఎందుకంటే బీఎస్పీకి ఇప్పటికీ 13 శాతం ఓట్లు ఉన్నాయి. బీఎస్పీని కలుపుకుంటే ఉత్తరప్రదేశ్‌లో క్లీన్‌స్పీప్ చేయవచ్చని చెబుతున్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే, దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తుందంటున్నారు.