కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో(Bangalore) నీటి ఎద్దడి(Water crises) తీవ్రంగా ఉంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva kumar) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! కరువు ప్రభావం బెంగళూరు నగరంపై పడింది. ఐటీ ఇండస్ట్రీకి పట్టుకొమ్మ అయిన ఆ నగరంలో వేసవి రాకమునుపే రిజర్వాయర్లు ఎండిపోయాయి.
కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో(Bangalore) నీటి ఎద్దడి(Water crises) తీవ్రంగా ఉంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాలలో రాష్ట్రం ఇంత తీవ్రమైన కరువును ఎప్పుడూ చూడలేని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva kumar) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! కరువు ప్రభావం బెంగళూరు నగరంపై పడింది. ఐటీ ఇండస్ట్రీకి పట్టుకొమ్మ అయిన ఆ నగరంలో వేసవి రాకమునుపే రిజర్వాయర్లు ఎండిపోయాయి. తాగునీటికి కటకట ఏర్పడింది. నీటి వాడకంపై ప్రజలకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. నీటి కోస ప్రజలు ట్యాంకర్లను కొనాల్సి వస్తున్నది. ట్యాంకర్లు కూడా రేట్లు పెంచేశాయి. ఇదిలాఉంటే నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ(Congress Party) అగ్రనేత రాహుల్‌గాంధీకి(Rahul gandhi) ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'రాహుల్ జీ..దయచేసి బెంగళూరులో నీటి సంక్షోభాన్ని ముగించేందుకు చర్యలు తీసుకోండి. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నా ఫ్రెండ్ తన ఎక్స్‌పీరియన్స్‌ను నాతో పంచుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అతడు అమ్మాయి కోసం చూస్తున్నాడు. కానీ, బెంగళూరులో నీటి సమస్య కారణంగా అతడితో మూడు ముళ్లు వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు' అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.