మనం మోసం పోయినంతకాలం మోసంచేసేవారు ఈ సమాజంలో ఉంటారు. ఆధునిక కాలంలో కూడా పాత చింతకాయ పచ్చడిలాంటి పనికిమాలిన అపోహలను సృష్టించేవారి మాటలను ఇంకా నమ్మి మోసపోతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో(Bangalore) చోటుచేసుకుంది. ఐటీ హబ్‌గా(IT Hub) ఉన్న బెంగళూరులో కూడా ఇలాంటి మూఢనమ్మకాల వార్తలకు లొంగిపోతున్నాం. ఓ మహిళ భర్తకు మృత్యుగండం ఉందంటూ మరో మహిళ నమ్మించింది. పూజల పేరుతో బంగారాన్ని ఎత్తుకునివెళ్లింది.
మనం మోసం పోయినంతకాలం మోసంచేసేవారు ఈ సమాజంలో ఉంటారు. ఆధునిక కాలంలో కూడా పాత చింతకాయ పచ్చడిలాంటి పనికిమాలిన అపోహలను సృష్టించేవారి మాటలను ఇంకా నమ్మి మోసపోతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో(Bangalore) చోటుచేసుకుంది. ఐటీ హబ్‌గా(IT Hub) ఉన్న బెంగళూరులో కూడా ఇలాంటి మూఢనమ్మకాల వార్తలకు లొంగిపోతున్నాం. ఓ మహిళ భర్తకు మృత్యుగండం ఉందంటూ మరో మహిళ నమ్మించింది. పూజల పేరుతో బంగారాన్ని ఎత్తుకునివెళ్లింది. బెంగళూరులోని కొత్తనూరు దొడ్డగుబ్బిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
నీ భర్తకు ప్రమాదం పొంచి ఉంది అంటూ శకుంతల(Shakunthala) అనే మహిళను మోసగత్తె చెప్పింది. శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం కేవలం నీ భర్త 9 రోజుల్లో చనిపోతాడని, నీ భర్తకు ప్రాణగండం ఉందని కొన్ని పూజలు చేస్తే నీ భర్త బతుకుతాడని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. పసుపుకుంకుమలతో జీవితాంతం ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలని కిలాడీ నమ్మబలికింది. మంత్రగత్తె శంకుతలను భయపెట్టింది. నీ భర్త జీవించాలంటే నువ్వు వెంటనే నేను చెప్పినట్లు ప్రత్యేక పూజలు చేయాలని ఆ మహిళ శంకుతలను నమ్మించింది. దీంతో భయాందోళనకు గురైన శకుంతల మహిళ చెప్పినట్లు పూజలు చేసేందుకు అంగీకరించింది. పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. పూజలు ప్రారంభిస్తున్నట్లు ఆ మహిళ శకుంతలను నమ్మించింది. కొంత సేపటి వరకు ఏవేవో మంత్రాలు చదవడం ప్రారంభించింది. అంతేకాకుండా తన ఒంటిమీద, ఇంట్లో ఉన్న బంగారాన్ని కుండలో వేయాలని చెప్పింది.
దీంతో శకుంతల అమాయకంగా ఆ కుండలో మంగళసూత్రాలు, నగలన్నీ కుండలో ఉంచింది. కళ్లు మూసుకొని ఉండాలని శకుంతలను మహిళ సూచించింది. కళ్లు తెరిస్తే పూజల ఫలితం రాదని కొత్త ఎత్తులు వేసింది. దీంతో ధ్యానం చేసుకుంటూ కుండ ముందే శకుంతల కూర్చుంది. ఆ తర్వాత కూడా ఈ దొంగ మహిళ మంత్రాలను వల్లెవేసింది. కొంత సేపటి తర్వాత కుండలో ఉన్న బంగారాన్ని తీసుకుని మెల్లగా అక్కడి నుంచి ఉడాయించింది. భర్త వచ్చిన తర్వాతే ఇద్దరు కలిసి కుండను తెరవాలని సూచించింది. దీంతో సాయంత్రం భర్త వచ్చేంతవరకు ధ్యానం చేస్తూనే ఉండిపోయింది శకుంతల. తన భర్త ఇంటికి వచ్చిన తర్వాత కుండ తెరిచి చూడగా అందులో నగలు మాయమయ్యాయి. కిలాడీ లేడీనే నగలు ఎత్తుకెళ్లిందని గ్రహించిన భార్యాభర్తలు లబోదిబోమంటూ కొత్తనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితురాలి కోసం గాలిస్తున్నామని కొత్తనూరు పోలీసులు తెలిపారు. నిందితురాలు తెలుగు, కన్నడ భాష మాట్లాడిందని బాధితులు తెలిపారు.