పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద గురువారం రాత్రి బీజేపీ నాయకుడు సువేందు అధికారి కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉండగా కారు ఢీకొట్టింది.

పశ్చిమ బెంగాల్‌(West Bangal)లోని పుర్బా మేదినీపూర్(Purba Medinipur)జిల్లాలోని చాందీపూర్(Chandipur) వద్ద గురువారం రాత్రి బీజేపీ(BJP) నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. సీక్ ఇస్రాఫిల్(Seikh Israfil) అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉండగా కారు ఢీకొట్టింది. ఆ వాహనం నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌లో భాగమా కాదా అనేది పోలీసులు ఇంకా ధృవీకరించలేదని పీటీఐ నివేదించింది.

ఎమ్మెల్యే సువేందు అధికారి మొయినా(Moina)లో పార్టీ కార్యక్రమం నుండి తిరిగి వస్తున్నట్లు పీటీఐ నివేదించింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆగలేదని ప్రత్యక్ష సాక్షి(Eyewitness) తెలిపాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను స్థానిక దుకాణంలో టీ(Tea) తాగుతున్నానని, ప్రమాద స్థలానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నానని చెప్పాడు. "ఆ వ్యక్తి రోడ్డుకు కుడి వైపున ఉన్నాడు. కాన్వాయ్(Convoy) ఎడమ వైపు నుండి వస్తోంది. అకస్మాత్తుగా, కాన్వాయ్‌లోని కారు ఒకటి రహదారికి కుడి వైపుకు వెళ్లి వ్యక్తిని ఢీకొట్టింది" అని సాక్షి తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారు కొన్ని మీటర్ల దూరం వెనక్కు వెళ్లిందని.. వ్యక్తిని ఢీకొట్టడం గమనించి కారు డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండొచ్చని ఆందోళనకారులు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గంటకు పైగా రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్రమాదంపై స‌మాచారం అందడంతో.. పోలీసు బలగాలు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కారు ఢీకొన్న‌ వ్యక్తిని స్థానిక‌ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.

సీనియర్ జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. "మరణించిన సీక్ ఇస్రాఫిల్ పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు దాటుతుండ‌గా.. రాత్రి 10.30 గంటలకు కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రిలో మరణించినట్లు తెలిపారు. స్థానికులు చెబుతున్న‌ట్లుగా.. కారు సువేందు అధికారి కాన్వాయ్‌లో భాగమా కాదా అనేది అని తెలియాల్సివుంద‌ని అన్నారు. సువేందు అధికారి కాని.. బీజేపీ(BJP)కి చెందిన మరే ఇతర నాయకుడు ఈ అంశంపై స్పందించ‌లేదు.

Updated On 4 May 2023 9:38 PM GMT
Yagnik

Yagnik

Next Story