రెండేళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఎంత భయానకంగా ఉండిందో మనకు అనుభవమే. ఎంతోమంది కరోనాతో చనిపోయారు. కోవిడ్ బారిన పడిన ఎంతో మంది యువకులలో కమలేశ్ పాటిదార్ ఒకడు. 35 ఏళ్ల కమలేశ్‌కు కరోనా సోకడంతో అతడిని గుజరాత్‌లోని వడోదర ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఆ వైరస్‌తో పోరాడుతూ అతడు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. కరోనా నిబంధనల ప్రకారం కుటుంబసభ్యులు మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

Madhya Pradesh
రెండేళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఎంత భయానకంగా ఉండిందో మనకు అనుభవమే. ఎంతోమంది కరోనాతో చనిపోయారు. కోవిడ్ బారిన పడిన ఎంతో మంది యువకులలో కమలేశ్ పాటిదార్(Kamlesh Patidar) ఒకడు. 35 ఏళ్ల కమలేశ్‌కు కరోనా సోకడంతో అతడిని గుజరాత్‌లోని వడోదర ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఆ వైరస్‌తో పోరాడుతూ అతడు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. కరోనా నిబంధనల ప్రకారం కుటుంబసభ్యులు మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. విషాదాన్ని దిగమింగుకుని స్వస్థలానికి వచ్చేశారు. వీరుండేది మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లా కరోడ్కల గ్రామంలో. 2021లో జరిగిన ఈ విషాద ఘటన నుంచి ఇప్పుడిప్పుడే ఆ కుటుంబం బయటకు వస్తోంది. ఓ రోజు హఠాత్తుగా కమలేశ్ స్వగ్రామంలోని ఇంటికి వచ్చాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి సడన్‌గా ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావన్న ప్రశ్నకు మాత్రం అతడు జవాబివ్వలేకపోయాడు. దాంతో కుటుంబసభ్యులు అధికారులకు విషయం చెప్పారు. కమలేశ్‌ను పూర్తిగా విచారిస్తే స్పష్టత రావచ్చని పోలీసులు అంటున్నారు. ఆసుప్రతి వర్గాలు పొరపాటు చేశాయా? కమలేశ్ ఆరోజున చనిపోకపోతే మరి చనిపోయింది ఎవరు? వీటికి జవాబులు దొరకాల్సి ఉంది.
