యూపీలో(UP) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్(Ambulance) లేక ఆమె భర్త తోపుడుబండిపై డెడ్‌బాడీని తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక సంఘటన చూసి స్థానికులు కలతచెందారు. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లా అస్రౌలి గ్రామానికి చెందిన వేద్‌రాం భార్య మెహర్‌కు గుండుపోటు రావడంతో చికిత్స కోసం ఫిరోజాబాద్‌(Firozabad) జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ట్రామా కేంద్రంలో చికిత్స పొందుతూ మంగళవారం మెహర్‌(Mehar) మృతిచెందింది. పోస్టుమార్టం తర్వాత ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు భర్త వేద్‌రాం ప్రయత్నించాడు. ఇందుకు అంబులెన్స్‌ కావాలని ఆస్పత్రిని కోరాడు. రోజంతా ఎదురు చూసినా అంబులెన్స్‌ రాలేదు. తాము ఇతర జిల్లా(District) కావడంతో అంబులెన్స్ ఇవ్వడం కుదరదని ఆస్పత్రి సిబ్బంది అన్నారని మృతురాలి భర్త వేద్‌రాం చెప్పాడు. తన గోడును ఎవరూ పట్టించుకోకపోవడంతో భార్య మృతదేహాన్ని తోపుడుబండిపై(Cart) తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటనను చూసి స్థానికులు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో(Social media) పెట్టడంతో ఇది వైరలైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ జైన్‌ ఘటనపై విచారణకు ఆదేశించాడు.

Updated On 20 Dec 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story