సోనీ ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత పదజాలం ఉపయోగించినందుకు 26 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరవింద్ కుమార్ సోనీ అనే వ్యక్తిని మస్తూరి పట్టణంలో అరెస్టు చేసినట్లు బిలాస్‌పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) అర్చన ఝా తెలిపారు.

శనివారం భదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు సోనీ ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కన్హయ్య కుమార్ తన పార్టీ అభ్యర్థి దేవేంద్ర సింగ్ యాదవ్ కోసం ప్రచారం చేయడానికి బిలాస్పూర్ జిల్లాలో ఉన్నారు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో బహిరంగంగా అసభ్యకరమైన పదాలు, ఉద్దేశ్యపూర్వకంగా అవమానించినందుకు సోనీపై బీజేపీ నాయకుడు బీపీ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) కింద అభియోగాలు మోపారు.ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి మే 7 మధ్య మూడు దశల్లో పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 7న మూడో దశలో పోలింగ్ జరగనున్న బిలాస్‌పూర్ లోక్‌సభ స్థానంలో భిలాయ్‌లో కాంగ్రెస్‌కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ యాదవ్.. బీజేపీకి చెందిన టోఖాన్ సాహుతో పోటీ పడనున్నారు.

Updated On 14 April 2024 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story