ఓ మహిళ, ఓ పురుషుడు 10 నెలల పాటు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఓ మహిళ, ఓ పురుషుడు 10 నెలల పాటు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏడు అంశాల(Conditions) ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని మొదటి నిబంధన పెట్టుకున్నారు. ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా కలిసి కాలక్షేపం చేస్తారని రెండో క్లాజ్ పేర్కొంది. స్త్రీ తన ఇంటి వద్ద పురుషుడితో కలిసి జీవిస్తుందని మూడో నియమం, అతని ప్రవర్తన సరిగాలేదని అనుకుంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చని నాలుగో నిబంధన పెట్టుకున్నారు. మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదని నాలుగో నిబంధన చెబుతోంది. స్త్రీ, పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదని ఆరో నిబంధన పెట్టుకున్నారు. ఈ కాలంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదని ఆరవ నిబంధన చెబుతోంది. వేధింపులు మనిషికి మానసిక క్షోభ కలిగించి, తద్వారా అతని జీవితాన్ని నాశనం చేస్తే, స్త్రీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏడవ క్లాజ్‌లో ఉంది. ఇన్ని కండిషన్స్‌తో 10 నెలల పాటు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ కాలంలోనే ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో సదరు మహిళ పురుషుడిపై అత్యాచారం కేసు వేసింది. తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం(Rape case) చేశాడని యువతి ఆరోపించింది. మా మధ్య అగ్రిమెంట్‌ కాపీ ఉందంటూ పురుషుడు అగ్రిమెంట్‌ పత్రాలను కోర్టు ఎదుట పెట్టాడు. అయితే ఆ పత్రంలో ఉన్నదని తన సంతకం కాదని మహిళ కోర్టుకు తెలిపింది. తన క్లయింట్‌పై తప్పుడు కేసును మహిళ పెట్టిందని, ఆ అగ్రిమెంట్‌లో ఉన్నది మహిళ సంతకమేనని పురుషుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యర్థిని కేసులో తప్పుగా ఇరికించారు. వారు లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.. వారిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్ చూపుతోంది. అగ్రిమెంట్‌లో మహిళ సంతకం చేసింది. వారిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉండేందుకు అంగీకరించారని ఈ ఒప్పందం తెలియజేస్తోంది’’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. దీంతో ఈ కేసులో పురుషుడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story