రాజస్థాన్‌లో(Rajasthan) విషాదఘటన చోటు చేసుకుంది. ఖైరాల్-తిజురా జిల్లాలోని షేక్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. గత రాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో తండ్రితో సహా మూడు నెలల చిన్నపాప మృత్యువాత పడ్డారు. రూమ్ హీటర్‌(Room heater) వల్ల ఇంట్లో మంటలు చెలరేగడంతో తండ్రి దీపక్‌ యాదవ్, ఆయన కూతురు నిషిక ప్రమాదంలో సజీవదహనమయ్యారు.

రాజస్థాన్‌లో(Rajasthan) విషాదఘటన చోటు చేసుకుంది. ఖైరాల్-తిజురా జిల్లాలోని షేక్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. గత రాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో తండ్రితో సహా మూడు నెలల చిన్నపాప మృత్యువాత పడ్డారు. రూమ్ హీటర్‌(Room heater) వల్ల ఇంట్లో మంటలు చెలరేగడంతో తండ్రి దీపక్‌ యాదవ్, ఆయన కూతురు నిషిక ప్రమాదంలో సజీవదహనమయ్యారు. దీపక్‌ భార్య సంజూకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి(Hospital) తరలించారు. సంజూ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని షేక్‌పూర్‌ పోలీసులు వెల్లడించారు. కాగా రూమ్ హీటర్‌ వాడే సమయంలో నాణ్యమైనవి ఎంచుకోవాలని, వాటిని ముందుగా టెక్నీషియన్లతో పరిశీలించిన తర్వాతనే వాటిని వాడే ప్రయత్నం చేయాలని సూచించారు.

Updated On 23 Dec 2023 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story