West Bengal : కూటమికి బీటలు..బెంగాల్ సీఎం మమత సంచలన ప్రకటన !
ఇండియా(I.N.D.I.A) కూటమికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) బుధవారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. తాము కాంగ్రెస్‌తో(Congress) పొత్తు పెట్టుకోవడం లేదని
తేల్చి చెప్పారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

వచ్చే లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగమే. ఈ క్రమంలోనే మమతా తాజాగా ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేయడం సంచలనంగా మారింది. గురువారం రాహుల్(Rahul Gandhi) న్యాయయాత్ర బెంగాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ నేతల మధ్య మాటలతూటాలు పేలడం గందరగోళానికి దారితీసింది. బెంగాల్ సీఎం మమత, కాంగ్రెస్ నేత అధిర్‌రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా వామపక్ష పార్టీల పేరు ఎత్తితే చాలు దీదీకి చిర్రెత్తిపోతోంది. 34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎంతో(CPM) రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు మమత. కాంగ్రెస్‌ను కూడా లెఫ్ట్ నేతలు ప్రభావితం చేస్తున్నారని, మొత్తంగా కూటమినే డామినేట్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్ (Congress)పార్టీకి 2 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా అదే స్థాయిలో మమతకు కౌంటర్ ఇచ్చాయి. బెంగాల్‌లో(Bengal) తమకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, 42 స్థానాల్లో పోటీ చేస్తామంటూ అధిర్‌రంజన్ చౌదరి కౌంటర్ ఎటాక్ చేశారు. అటు సీపీఎం నేతలు కూడా..రాహుల్ న్యాయయాత్రకు టీఎంసీ నేతలు హాజరైతే..తాము పాల్గొనబోమని ప్రకటించారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కూటమిలో విభేదాలు లేవంటున్నారు. బెంగాల్‌లో పొత్తులపై అధిర్‌రంజన్ మాటలకు ప్రాధాన్యత లేదని, దీదీ తనతో నేరుగా టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే నేతల మధ్య ఉన్న విభేదాలతో రచ్చకెక్కడం కూటమి భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అసలు బెంగాల్‌లో పొత్తు సాధ్యమేనా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి.