మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్‌(Congress) నాయకుడు కేరళలోని వయనాడ్‌(wayanad) నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) రాయ్‌బరేలీ(Raibarelly) నుచి కూడా గెలిచారు.

మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్‌(Congress) నాయకుడు కేరళలోని వయనాడ్‌(wayanad) నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) రాయ్‌బరేలీ(Raibarelly) నుచి కూడా గెలిచారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాహుల్‌గాంధీ(Rahul gandhi) రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని ఉంచేసుకుని వయనాడ్‌ను వదులుకున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వయనాడ్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకకు మద్దతుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) వయనాడ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉంది. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంకగాంధీ ఇప్పటివరకు చట్టసభలకు పోటీ చేయలేదు. వయనాడ్‌ నుంచి ప్రియాంక పోటీ చేస్తే విజయం తథ్యమని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. అయితే ప్రియాంక కోసం మమత బెనర్జీ ప్రచారం చేస్తారంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆసక్తిరేపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకంపై తకరార్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి మమత ఇష్టపడలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీలోకి దిగారు. చిత్రమేమిటంటే ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో కలిసి ఉండటం!

Eha Tv

Eha Tv

Next Story