కోల్‌కతాలో(KolKata)జరిగిన ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor)హత్యాచార ఉదంతం దేశంలో సంచలనం సృష్టించింది.

కోల్‌కతాలో(KolKata)జరిగిన ట్రైనీ డాక్టర్‌(Trainee Doctor)హత్యాచార ఉదంతం దేశంలో సంచలనం సృష్టించింది. ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. అత్యంత క్రూరంగా ఆ ట్రైనీ వైద్యురాలిని చంపేశారని తెలిపింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee)రియాక్టయ్యారు. ఈ ఘటనపై విపక్షలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్‌ (Bangladesh)వంటి పరిస్థితులను సృష్టించాలని పథకం పన్నాయని ఆమె మండిపడ్డారు. హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు(Kolkata High court) సీబీఐ(CBI)కి అప్పగించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. సీబీఐకి తాము పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరగా తేలాలని తాము కూడా అనుకుంటున్నామని చెప్పారు. వైద్యురాలి కుటుంబానికి అండంగా ఉండాల్సింది పోయి బీజేపీ, సీపీఎంలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బంగ్లాదేశ్‌ వంటి పరిస్థితి ఇక్కడ కూడా తీసుకురాగలమని విపక్షాలు భావిస్తున్నాయేమో కానీ అది జరగని పని అని మమత తెలిపారు. తనకు అధికార వ్యామోహం లేదని, సంఘటన జరిగిన వెంటనే రాతంత్రా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని మమత తెలిపారు. తాము ఏం చేయలేదో, ఏ చర్యలు తీసుకోలేదో విపక్షాలు చెబితే బాగుంటుందని ఆగ్రహించారు. డీఎన్‌ఏ టెస్ట్‌(DNA Test),సీసీటీవీ ఫుటేజి (cctv footage)ని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం ఇలా అన్నింటిని 12 గంటల్లోనే జరిపామని, నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్ట్‌ చేశామని మమత వివరించారు. ఆదివారంలోపు సీబీఐ కేసును ఛేదించాలని మమత డిమాండ్‌చేశారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో తాను శుక్రవారం కోల్‌కతా వీధులలో నిరసన ప్రదర్శన చేయనున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

ehatv

ehatv

Next Story