అందరూ ఊహించందే జరిగింది. ఏపీసీసీ(APCC) చీఫ్‌గా వైఎస్ షర్మిలను(YS sharmila) కాంగ్రెస్ పార్టీ(Congress Party) నియమించింది. కొంత కాలం క్రితమే కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు. ఈ షరతుతోనే ఆమె కాంగ్రెస్‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. 2021, జులై 8న వైఎస్ షర్మిల తెలంగాణలో వైసార్‌టీపీని(YSRTP) స్థాపించారు. ఎన్నికలకు ముందు వరకు క్రియాశీలకంగానే ఉన్నా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.
అందరూ ఊహించిందే జరిగింది. ఏపీసీసీ(APCC) చీఫ్‌గా వైఎస్ షర్మిలను(YS sharmila) కాంగ్రెస్ పార్టీ(Congress Party) నియమించింది. కొంత కాలం క్రితమే కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు. ఈ షరతుతోనే ఆమె కాంగ్రెస్‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. 2021, జులై 8న వైఎస్ షర్మిల తెలంగాణలో వైసార్‌టీపీని(YSRTP) స్థాపించారు. ఎన్నికలకు ముందు వరకు క్రియాశీలకంగానే ఉన్నా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ(Rahul gandhi), ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. తాజాగా ఈరోజు ఆమెను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్(CM Jagan) విషయంలో షర్మిల ఎలాంటి వైఖరి తీసుకుంటుందోన్న చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), లోకేష్‌కు(Lokesh) కూడా షర్మిల రాజకీయంగా దగ్గరయ్యారు. కానీ జగన్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ఆమె కుమారుడి పెళ్లి(Marriage) పనుల్లో బిజీగా ఉన్నారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి(YS Raja Reddy), అట్లూరి ప్రియ(Atluri Priya) ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందిస్తున్నారు. ఇటీవల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.