తెలంగాణ ఉద్యమం గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు

తెలంగాణ ఉద్యమం(Telangana Movement) గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుందని కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) అన్నారు. చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్‌(KCR)పై మండిప‌డ్డారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు.. తెలంగాణ వల్ల ఒకే కుటుంబం లాభపడిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ(Sonia Gandhi) రాష్ట్రం ఇచ్చారని అన్నారు. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్ కి ఎక్కడిది? కేసీఆర్ కి బలం ఇచ్చింది మేమేన‌న్నారు. మాకు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ క్రెడిట్ అంతా నాదే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా నివాసానికి వచ్చి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపిన‌ట్లు గుర్తుచేశారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచి తీరుతామ‌న్నారు. కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరుస్తున్నాం.. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తామ‌న్నారు. సోనియా, రాహుల్ చెప్పిన మాటను అమలు పరచి చూపిస్తారన్నారు. కన్యాకుమారీ(Kanyakumari) నుండి కశ్మీర్(Kashmir) వరకు రాహుల్(Rahul Gandhi) పాదయాత్ర చేశారు. అది కాంగ్రెస్ పార్టీ(Congress Party) శక్తి అని కొనియాడారు.

రేపు తెలంగాణకి షా(Amit Shah) వస్తున్నారు. ఇన్నేళ్ల‌లో కాంగ్రెస్ ఎం చేసిందని అడుగుతారు. కేసీఆర్ పార్టీకి బీజేపీ(BJP)తో అంతర్గత ఒప్పంది ఉందన్నారు. కేసీఆర్ బీజేపీని, బీజేపీ కేసీఆర్ ని అందుకే ఏం అనడం లేదన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సమయంలో అసలు కేసీఆర్ పార్టీ ఉందా? అని ప్ర‌శ్నించారు. 26 పార్టీలు బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమైతే కేసీఆర్ మాత్రం సైలెంట్ ఉన్నారని అన్నారు. కేసీఆర్ తనది సెక్యులర్ పార్టీ అంటాడు.. బీజేపీకి మద్దతు ఇస్తాడని దుయ్య‌బ‌ట్టారు. మా 26 పార్టీల లక్ష్యం బీజేపీని గద్దె దించడంతో పాటు.. బీజేపీకి మద్దతిచ్చే బీఆర్ఎస్(BRS) ని సైతం గద్దె దించడ‌మేన‌న్నారు. రాజ్యాంగం లేకపోతే నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవ్వకపోయేవాడినన్నారు. మేం అక్షరాస్యత పెంచడంపై దృష్టి పెట్టాం కాబట్టే.. మోదీ(PM Modi), షా, కేసీఆర్ చదువుకోగలిగారని అన్నారు.

Updated On 26 Aug 2023 10:12 PM GMT
Yagnik

Yagnik

Next Story