కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేత, చిత్తాపూర్‌ అభ్యర్థి మణికాంత్‌ రాథోడ్‌ కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ స్పందించారు. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా నవ్వాను.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే(Mallikarjuna Kharge), ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేత, చిత్తాపూర్‌ అభ్యర్థి మణికాంత్‌ రాథోడ్‌(Manikanth Rathod) కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌(Congress) ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలపై మణికాంత్ రాథోడ్ స్పందించారు. అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా నవ్వాను. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ ఉంది. అందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేశాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఫేక్ అని, నేను ఎవరినీ బెదిరించలేదని రాథోడ్ అన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేత కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా(Ranadeep Surjewala) శనివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గేను అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేసేందుకు కుట్ర ప‌న్నిన‌ట్లు మాట‌లు ఉన్న‌ ఆడియో క్లిప్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆ మాట‌లు చిత్తాపూర్‌ (Chitthapur)బీజేపీ అభ్యర్థి మణికాంత్‌ రాథోడ్‌విగా కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది.

మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge).. మణికాంత్ రాథోడ్ ప్ర‌త్య‌ర్ధిగా చిత్తాపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గేలు ప్రధాని మోదీ(Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. ఇక‌ మణికాంత్ రాథోడ్‌పై 30 క్రిమినల్ కేసులు(Criminal Cases) నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో ప్రియాంక్ ఖర్గేను బెదిరించినందుకు రాథోడ్‌ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated On 6 May 2023 10:50 PM GMT
Yagnik

Yagnik

Next Story