ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Malikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలా మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినప్పటికీ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి నోటి వెంట ఇలాంటి మాట రావడం ఇదే మొదలు.

ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Malikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాలా మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చినప్పటికీ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి నోటి వెంట ఇలాంటి మాట రావడం ఇదే మొదలు. భారతదేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలన్నది ప్రధానమంతి నరేంద్రమోదీ ఆలోచన అని, ఇందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఖర్గే అన్నారు. రష్యా అధినేత పుతిన్‌లా, పక్కనే ఉన్న చైనా(China) అధ్యక్షుడు జిన్‌పింగ్‌లా జీవితకాలం అధ్యక్షుడిగా నరేంద్రమోదీ(Narendra) కొనసాగాలనుకుంటున్నారని ఖర్గే తెలిపారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ(BJP) గెలిస్తే మాత్రం అవే చిట్ట చివరి ఎన్నికలు అవతాయని వివరించారు. గతంలో రష్యాలో(Russia) ఉన్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఏ రకంగా జీవితకాల అధ్యక్షుడిగా అయ్యారో, చైనాలో ఏం జరిగిందో భారతదేశంలో అదే జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Updated On 30 Jan 2024 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story