Modi Oath Ceremony : మోదీ ప్రమాణ స్వీకారానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు !
దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ(Narendra modi) ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వర్తమానం పంపింది భారత్. వాళ్లకు ఆహ్వానం పలకడానికి ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
దేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ(Narendra modi) ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలకు వర్తమానం పంపింది భారత్. వాళ్లకు ఆహ్వానం పలకడానికి ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇందులో మాల్దీవుల అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంది. నిరుడు నవంబర్‌లో మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) మాల్దీవ్స్(Maldives) అధ్యక్షుడయ్యారు. అప్పట్నుంచి ఇండియాతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పైగా చైనాతో(China) సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాడు. ఇండియాను విమర్శించడంతో పాటు బలగాలు తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలిచ్చాడు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షిణిస్తూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహమ్మద్ ముయిజ్జుకు ఆహ్వానం పంపింది భారత్. ఆ ఆహ్వానానికి ముయిజ్జు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని చెప్పారు. తన పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఆయన కోరుకుంటున్నారు.