ఉత్తరప్రదేశఖ్‌లోని మొరాదాబాద్‌లో ఓ సంఘటన జరిగింది. ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్ అమ్మడంపై హిందువులు నిరనస తెలిపారు.
ఉత్తరప్రదేశఖ్‌లోని మొరాదాబాద్‌లో ఓ సంఘటన జరిగింది. ముస్లిం డాక్టర్‌కు ఫ్లాట్ అమ్మడంపై హిందువులు నిరనస తెలిపారు. స్థానిక టీడీఐ(TDI) సిటీ సొసైటీలో ఉండే డాక్టర్ అశోక్ బజాజ్ (Doctor Ashok Bajaj)తన ఫ్లాట్‌ను సహచరుడు డాక్టర్ ఇక్రా చౌదరి(DR.Ekra Chowdhary)కి అమ్మాడు. విషయం తెలుసుకున్న హౌసింగ్ సొసైటీకి చెందిన హిందువులు కాలనీ గేట్ దగ్గర నిరసన తెలిపారు.
మకాన్ వాపస్ లో అంటూ ఓ పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. నినాదాలు చేశారు. ఇతర వర్గాల ప్రజలు ఇక్కడ నివసించడం తమకు ఇష్టం లేదన్నారు. సామరస్య వాతావరణానికి భంగం కలుగుతుందని, ముస్లిం డాక్టర్‌కు అమ్మిన ఇల్లు గుడికి సమీంలో ఉందని అంటున్నారు.జిల్లా కలెక్టర్ అనుజ్‌కుమార్ సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ మాత్రం ఏం చేస్తారు? సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నారు.సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అయినా 400కు పైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్న చోట ఓ ముస్లిం ఫ్యామిలీ ఉంటే సామరస్య వాతావరణానికి ఎలా భంగం వాటిల్లుతుందో అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.