తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) నేత మహువా మొయిత్రాకు(Mahua Moitra) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఈడీ మరోసారి సమన్లు(Sumons) జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం,(ఫెమా) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులలో తెలిపింది.

Mahua Moitra
తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) నేత మహువా మొయిత్రాకు(Mahua Moitra) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) ఈడీ మరోసారి సమన్లు(Sumons) జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం,(ఫెమా) నిబం ధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులలో తెలిపింది. దుబాయ్‌కు(Dubai) చెందిన వ్యాపార వేత్త దర్శన్ హీరానందానికి(Darshan Heeranada) కూడా సమన్లు పంపింది. కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేసినా విచారణకు ఆమె హాజరు కాలేదు. ఇదే కేసులో గత శనివారం సీబీఐ మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ఈడీ మూడో సారి ఆమెకు సమన్లు జారీ చేసింది.పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల కేసులో మహువాపై విచారణ చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది..
