మహారాష్ట్రలో(maharastra) ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతున్నదో మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా తెలియడం లేదు. ఎన్‌సిపి(NCP) నాయకురాలు, శరద్‌పవార్(sharad pawar) కూతురు సుప్రియా సూలె(Supriya sule) ఓ పక్షం రోజుల కిందట త్వరలో రెండు రాజకీయ భూకంపాలు సంభవిస్తాయని చెప్పారు. అందులో ఒకటి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(Congress) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం అని అనుకోవాలి.
మహారాష్ట్రలో(maharastra) ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతున్నదో మాత్రం రాజకీయ విశ్లేషకులు కూడా తెలియడం లేదు. ఎన్‌సిపి(NCP) నాయకురాలు, శరద్‌పవార్(sharad pawar) కూతురు సుప్రియా సూలె(Supriya sule) ఓ పక్షం రోజుల కిందట త్వరలో రెండు రాజకీయ భూకంపాలు సంభవిస్తాయని చెప్పారు. అందులో ఒకటి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(Congress) అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం అని అనుకోవాలి. 82 ఏళ్ల శరద్ పవార్ పదవిలోంచి తప్పుకోవడం విచిత్రమనిపించలేదు కానీ టైమే రాంగనిపిస్తోంది.
తన ఆత్మకథ లోక్ మాజే సంగటి (ప్రజలు నాకు తోడుగా ఉంటారు) అనే మరాఠీ పుస్తకావిష్కరణ సభలో పవార్ రాజీనామా ప్రకటన చేశారు. దాంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కార్యకర్తలు, నాయకులు వేడుకున్నారు. కొందరు కన్నీరు పెట్టుకున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కుదరని పని అని పవార్ మొదట చెప్పినా తర్వాత పునరాలోచనకు రెండు మూడు రోజుల సమయాన్ని అడిగారు. మరో మూడేళ్ల పాటు తన రాజ్యసభ సభ్యత్వం ఉందని, ఈ సమయంలో తాను మహారాష్ట్ర, దేశానికి సంబంధించిన సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇంత అకస్మాత్తుగా పవర్ ఎందుకా నిర్ణయం తీసుకున్నట్టు? ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌తో(Ajith pawar) పడటం లేదా? అజిత్ పవార్ చేస్తున్న కార్యకలాపాలు నచ్చడం లేదా? అవుననే అనుకుంటున్నారు విశ్లేషకులు. బీజేపీతో(BJP) కలిసి తాను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయితే తప్పేముందని ఇటీవల అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు శరద్ పవార్‌ను బాధించాయట! అలాగని అజిత్‌ను పార్టీ నుంచి సస్పెండు కూడా చేయలేరు. అందుకే ఇటీవల శరద్‌పవార్ చాలా అన్యమనస్కంగా ఉంటున్నారు.
వయసు మీద పడింది కాబట్టి అలా వ్యవహరిస్తున్నారేమోనని అనుకున్నారంతా! దానికి కారణం ఎటూ తేల్చుకోలేకపోవడమేనని ఇప్పుడు అర్థమవుతోంది. బీజేపీకి దగ్గరవ్వడం పట్ల శరద్‌పవార్‌కు ఎలాంటి అభ్యంతరమూ లేదట! అదానీపై జేపీసీ విచారణ డిమాండ్ వ్యవహారంలో పవార్ అదానీవైపే ఉన్నారు. గౌతమ్ అదానీతో(Goutham adani) సమావేశం కూడా అయ్యారు. ఈ పరిణామాలు చూస్తే బీజేపీతో పవార్ చేతులు కలిపే అవకాశాలను కొట్టి పారేయలేము. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడం కోసం విపక్ష పార్టీలను ఏకం చేస్తానని చెప్పిన శరద్‌పవారేనా ఇలా చేస్తున్నది అన్న అనుమానం కూడా కలుగుతోంది.
తన చేతుల్లోంచి పుట్టిన పార్టీ తనకు కాకుండా పోతున్నదన్న దిగులు కూడా ఆయనలో కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌సిపిలో చాలా మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు జై కొడుతున్నారట! 53 మంది ఎమ్మెల్యేలలో 34 మంది అజిత్‌కు మద్దతు తెలుపుతున్నారట. మహా వికాస్ అఘాడీ కూటమిపై తిరుగుబాలుచేసి బీజేపీ అండ పొందుతున్న 16 మంది శివసేన ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. సుప్రీంకోర్టు కనుక వీరిపై అనర్హత వేటు వేస్తే మహా రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. అప్పుడు అజిత్ పవార్ సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చన్న ప్లాన్‌తో బీజేపీ ఉంది.
ఇదిలా ఉంటే శరద్ పవార్ రాజీనామా ప్రకటనపై శివసేన (ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర రాజకీయాలో చరిత్ర పునరావృతమవుతుందని చెప్పారు. నీచ రాజకీయాలకు విసుగు చెంది అప్పటి శివసేన అధినేత బాల్ థాక్రే అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని, కానీ శివసేన నాయకుల ప్రేమకు తలొగ్గి తన నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారని సంజయ్ రౌత్ అన్నారు. ఇప్పుడు శరద్ పవార్ విషయంలో కూడా అదే జరగవచ్చని తెలిపారు. చాలా మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలకు బీజేపీ కూటమిలో చేరాలని ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తమ దరికి రావానేది వీరి భావన! అయితే ఏక్‌నాథ్ షిండేలా అజిత్ పవార్ పార్టీని చీల్చలేరు. అజిత్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు కూడా శరద్ పవార్ ఆశీర్వాదం లేకుండా అడుగు ముందుకు వేయలేరు. చూద్దాం ఏం జరుగుతుందో!