రెండు చేతులా సంపాదన. చక్కటి జీవితం. మంచి కుటుంబమనే పేరు. ఇన్ని ఉన్నా ఆమె మెదడును పురుగు తొలిచింది. మామగారికి ఉన్న అపార సంపదపై కన్నుపడింది.
రెండు చేతులా సంపాదన. చక్కటి జీవితం. మంచి కుటుంబమనే పేరు. ఇన్ని ఉన్నా ఆమె మెదడును పురుగు తొలిచింది. మామగారికి ఉన్న అపార సంపదపై కన్నుపడింది. ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలనే దుర్భుద్ధి పుట్టింది. మామను చంపేస్తే ఆస్తి దక్కుతుందని అనుకుంది. కారుతో ఢీ(accident) కొట్టి చంపేస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావనుకుంది. ఇందు కోసం కోటి రూపాయలు సుపారీ ఇచ్చింది. పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. లోతుగా దర్యాప్తు చేస్తే అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ దురాగతం మహారాష్ట్రలోని(Maharashtra) నాగ్‌పూర్‌లో(Nagpur) జరిగింది. 53 ఏళ్ల అర్చన మనీశ్ పుట్టేవార్ ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. భర్త మనీశ్ ఏమో డాక్టర్. చేతినిండా సంపాదన ఉన్నా మామ పురుషోత్తం పుట్టెవార్(82)పై అర్చనకు కన్నుపడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఉంది. మామను చంపేస్తే సుమారు 300 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం తమ సొంతం అవుతుందని అనుకుంది. మామ హత్యకు కుట్ర పన్నింది. తన భర్త దగ్గర డ్రైవర్‌గా పని చేసే బగ్డే, అతడి దోస్తులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్‌కు ఆ పని అప్పగించింది. పక్షం రోజుల కిందట హాస్పిటల్‌లో ఉన్న తన భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీ కొట్టి పారిపోయారు. ఈ ఘటనలో పురుషోత్తం చనిపోయారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఉద్దేశపూర్వకంగానే చంపేశారని పోలీసులకు డౌట్ వచ్చింది. దర్యాప్తు జరిపితే అర్చన్ కుటిలత్వం బయటపడింది. ఆమెతో పాటు హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్చన ఉద్యోగం అయినా చక్కగా వెలగబెడుతుందా అంటే అదీ లేదట! బోల్డన్ని అక్రమాలకు పాల్పడిందట! పోలీసులు ఇప్పుడు ఆ చిట్టా కూడా తీసే ప్రయత్నంలో ఉన్నారు.