చదువుకునే పిల్లలకేనా డ్రస్ కోడ్(Dress Code)! చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఉండొద్దా? అని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. వెంటనే డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ఇక నుంచి టీచర్లు(Teachers) జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు వేసుకుని స్కూలుకు రాకూడదు. టీచర్లు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలంటూ ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
చదువుకునే పిల్లలకేనా డ్రస్ కోడ్(Dress Code)! చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఉండొద్దా? అని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. వెంటనే డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ఇక నుంచి టీచర్లు(Teachers) జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు వేసుకుని స్కూలుకు రాకూడదు. టీచర్లు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలంటూ ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నది ప్రభుత్వం అభిప్రాయం. డ్రస్ కోడ్ విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. గైడ్‌లైన్స్ ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్‌లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులు వేసుకోకూడదు. కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, చీర ధరించాలట! పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలట. పైగా ఇన్‌షర్ట్ చేసుకోవాలట! ఈ నిబంధనలు గవర్నమెంట్ స్కూల్స్‌కే కాదు, ప్రైవేటు స్కూల్ టీచర్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉపధ్యాయులు ఏ దుస్తులు వేసుకోవాలి? ఏ బట్టలు వేసుకోకూడదన్నది వారి వ్యక్తిగతవిషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.