పెళ్లి అంటే గతంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని మంచి కుటుంబం అని పెళ్లిళ్లు చేసుకునేవారు.

పెళ్లి అంటే గతంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని మంచి కుటుంబం అని పెళ్లిళ్లు చేసుకునేవారు. పెద్దలు నిర్ణయించిన పెళ్లిని అమ్మాయిలు, అబ్బాయిలు తల దించుకొని మారుమాట మాట్లడకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లి కొడుకు ఇంటి ముందు పెద్ద గడ్డివాము ఉంటే కూడా కళ్లు మూసుకొని పిల్లను ఇచ్చేవారు. గడ్డివామును బట్టి వారి వ్యవసాయం ఎంత ఉంది, ఎన్ని పశువులు ఉన్నాయనే అంచనాకు వచ్చేవారట. రానురాను ట్రెండ్ మారింది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురుకు కోరికలు ఎక్కువయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలకే అంచనాలు పెరిగిపోయాయి. తన తండ్రి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నా కానీ తనకు కాబోయే వరుడు వాషింగ్టన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యి ఉండాలనే కలకలలు కంటున్నారు. అబ్బాయి చదువు ఏంటి, ఆస్తిపాస్తులు ఎన్ని అని చూసేవారు. అబ్బాయికి మంచి ఇల్లు ఉందా, పొలం ఉందా, ఇంకా ఇతరత్రా ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది చూసేవారు. అయితే ఈ కేసులో ఇంకా కాస్త ఒక అడుగు ముందుకు పడింది. అమ్మాయిలు. చిత్ర విచిత్రమైన కారణాలతో వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. తాజాగా వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు వివాహం కుదిర్చారు. అయితే, అమ్మాయి మేనమామ అబ్బాయి CIBIL స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు.
