రెండు మూడు రోజులుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) -ఎన్‌సీపీ(NCP)పై అదే పనిగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర(Maharastra) మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి బీజేపీ(BJP)లోకి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. రేపో మాపో అజిత్ పవార్ బ్యాచ్ బీజేపీలో చేరడం ఖాయమంటూ కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదంతా వట్టి అబద్ధమని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
రెండు మూడు రోజులుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party) -ఎన్‌సీపీ(NCP)పై అదే పనిగా వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర(Maharastra) మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి బీజేపీ(BJP)లోకి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. రేపో మాపో అజిత్ పవార్ బ్యాచ్ బీజేపీలో చేరడం ఖాయమంటూ కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదంతా వట్టి అబద్ధమని అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్న మీడియాపై కాసింత అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదని, తాను ఎన్‌సిపీలోనే ఉంటానని అన్నారు. ఎన్‌సిపిలో ముసలం ఏర్పడిందంటూ పనిగట్టుకుని వార్తలు రాస్తున్నారని, ఇలాంటి ప్రచారాల వల్ల ఎన్‌సిపి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని అజిత్ అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 'ఎన్‌సిపి అన్నది శరద్‌పవార్ నాయకత్వంలో ఏర్పడిన పార్టీ. అధికారంలో ఉన్నా, లేకపోయినా మన ఉనికి మనదే' అని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఎన్‌సిపిలో పవార్ తర్వాత ఎవరు అని అడిగితే అజిత్ పవారేనని అందరూ చెబుతారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా అజత్ వెంట వున్నారు. అజిత్ పవార్ ఇలా అంటుంటే శరద్‌పవార్ కూతురు సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలు కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులు ఏర్పడే అవకాశం ఉందంటూ సుప్రియా వ్యాఖ్యానించారు. ఒకటి ఢిల్లీ స్థాయిలో అయితే, మరోటి మహారాష్ట్రలో అని సుప్రియా అన్నారు. ఈ కామెంట్లపై మహారాష్ట్రలో బోల్డంత చర్చ జరుగుతోంది. అవి ఏమిటన్న ప్రశ్నకు మాత్రం సుప్రియా నుంచి సమాధానం రాలేదు. అజిత్ పవార్ పార్టీ మారడం గురించి అడిగితే , ఆ విషయాన్ని అజిత్ దాదానే అడగాలని ఆమె బదులిచ్చారు. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పనులు ఉన్నాయని,ఉత్తినే మాట్లాడేందుకు తన దగ్గర సమయం లేదని సుప్రియా తెలిపారు.
ఎన్‌సిపి ఎమ్మెల్యేల చీలిక వచ్చిందని, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వస్తున్న కథనాలను ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్ ఖండించారు.