మహారాష్ట్ర(Maharastra)లో ఆదివారం పెను దుమారమే రేగింది. శనివారం వరకు మౌనంగా ఉన్న రాజకీయ కార్యకలాపాలు ఆదివారం ఉదయం ఒక్కసారిగా జోరందుకోగా.. వెంటనే డబుల్ ఇంజన్ ప్రభుత్వంలోకి మరో ఇంజన్ చేరింది. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఆవిర్భవించింది. నిన్నటివరకూ భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే వర్గం పొత్తులో సంకీర్ణ ప్రభుత్వం ఉండగా..
మహారాష్ట్ర(Maharastra)లో ఆదివారం పెను దుమారమే రేగింది. శనివారం వరకు మౌనంగా ఉన్న రాజకీయ కార్యకలాపాలు ఆదివారం ఉదయం ఒక్కసారిగా జోరందుకోగా.. వెంటనే డబుల్ ఇంజన్ ప్రభుత్వంలోకి మరో ఇంజన్ చేరింది. దీంతో మహారాష్ట్రలో ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఆవిర్భవించింది. నిన్నటివరకూ భారతీయ జనతా పార్టీ(BJP), శివసేన షిండే వర్గం పొత్తులో సంకీర్ణ ప్రభుత్వం ఉండగా.. నేడు వీరితో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్(Ajit Pawar) కలిశారు. తనకు 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యే(NCP MLA)ల మద్దతు కూడా ఉందని అజిత్ ప్రకటించారు.
శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించిన అజిత్ పవార్ ఆదివారం నాడు మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ప్రభుత్వానికి తన మద్దతును అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో అతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ.. ఇప్పుడు మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం(Triple Engine gvt) ఉందన్నారు. ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తోందని.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్‌గా మారిందన్నారు. ఇప్పుడు మనకు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉన్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం.. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్‌గా మారింది. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్, ఆయన నాయకులను నేను స్వాగతిస్తున్నాను. అజిత్ పవార్ అనుభవం రాష్ట్ర పటిష్టతకు దోహదపడుతుందన్నారు.
ఈ అనూహ్య పరిణామంతో ఎన్సీపీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎమ్మెల్యేలలో అజిత్ పవార్, ఛగన్ భుజబల్(Chhagan Bhujbal), దిలీప్ పటేల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, ధర్మారావు, అదితి తత్కరే, సంజయ్ బన్సోడే, అనిల్ పాటిల్ ఉన్నారు.