మహారాష్ట్ర(Maharastra) భూషణ్‌ పురస్కార(Bhushan Puraskar) ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి లక్షలాది మంది జనం వచ్చారు. అంత మంది వస్తారన్న విషయం తెలిసి కూడా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యమే 13 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. అసలే ఎండలు మండుతున్నాయి. ఎండ నుంచి జనాలకు రక్షణ కల్పించడానికి టెంట్లో, షెడ్లో వేయాలి కదా!

మహారాష్ట్ర(Maharastra) భూషణ్‌ పురస్కార(Bhushan Puraskar) ప్రదానోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి లక్షలాది మంది జనం వచ్చారు. అంత మంది వస్తారన్న విషయం తెలిసి కూడా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యమే 13 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. అసలే ఎండలు మండుతున్నాయి. ఎండ నుంచి జనాలకు రక్షణ కల్పించడానికి టెంట్లో, షెడ్లో వేయాలి కదా! వీఐపీలు కూర్చొనే వేదిక వరకు మాత్రం టెంట్లు వేశారు. షెడ్లు కూడా వేశారు. సామాన్య జనాన్ని మాత్రం ఎండలో మండిపోయేలా చేశారు. ఫలితంగా చాలా మందికి వడదెబ్బ తగిలింది. 13 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సుమారు ఆరువందల మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

చనిపోయినవారిలో ఎనిమిది మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నవీ(CM Eknath Shinde) ముంబాయి(Mumabi)కి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అయిదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. వడదెబ్బ(heat stroke) బాధితుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక మహారాష్ట్ర భూషణ్‌ పుస్కారం(Maharashtra Bhushan Award) సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్(Dattatreya Narayan) అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారి(Appasaheb Dharmadhikari)కి లభించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(AMIT SHAH), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే((CM Eknath Shinde)), డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis), కేంద్ర మంత్రి కపిల్ పాటిల్(Kapil Patil) తదితరులు హాజరయ్యారు.

Updated On 17 April 2023 12:13 AM GMT
Ehatv

Ehatv

Next Story