మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యయి. ఓటు వేసేందుకు జనం బారులు తీరారు. మహారాష్ట్ర (Maharashtra)లో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతున్నది. జార్ఖండ్‌ (Jharkhand)లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటితో పాటుగా పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బారామతిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అభ్యర్థి అజిత్‌ పవార్ ఓటు వేశారు. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ముంబాయిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఓటు వేశారు. ముంబాయిలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌, సినీ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్‌, నటి గౌతమీ కపూర్‌, నటులు అక్షయ్‌ కుమార్‌, అలీ ఫజల్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌. సచిన్‌ తెందూల్కర్‌, భార్య అంజలి, కూతురు సారా తొలి గంటల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బారామతిలోని పోలింగ్‌ కేంద్రంలో ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ehatv

ehatv

Next Story