వారణాసి(Varanasi) లోక్‌సభ నియోజకవర్గం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra modi) పోటీ చేస్తున్నారని కాదు. ఇక్కడ నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్‌(Transgender) కూడా బరిలో దిగారు.

వారణాసి(Varanasi) లోక్‌సభ నియోజకవర్గం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra modi) పోటీ చేస్తున్నారని కాదు. ఇక్కడ నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్‌(Transgender) కూడా బరిలో దిగారు. అఖిల భారత హిందూ మహాసభ తరఫున మహామండలేశ్వర్‌ హేమంగ్‌ సఖి(Mahamandaleshwar Hemangi Sakhi) మా పోటీ చేస్తున్నారు. వారణాసితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని 20 లోక్‌సభ స్థానాలలో అఖిల భారత హిందూ మహాసభ పోటీ చేస్తున్నది.వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ 63 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. రెండో స్థానంలో సమాజ్‌వాదీపార్టీకి చెందిన షాలినీ యాదవ్‌ నిలిచారు. కాంగ్రెస్‌(Congress) మూడో స్థానంలో ఉంది. ఈసారి మాత్రం ఇండియా కూటమిలో(INDIA alliance) భాగంగా కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక హేమాంగ్‌ సఖి మా విషయానికి వస్తే ఆమె గుజరాత్‌లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్‌. అందుకే ఆమె కుటుంబం ముంబాయికి వెళ్లాల్సి వచ్చింది. కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుకున్న హేమాంగి సఖికి చిన్నప్పుడే కష్టాలు ఎదురయ్యాయి. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో స్కూల్‌ చదువు మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె కొన్ని ప్రముఖ టీవీ షోలను కూడా నిర్వహించారు. ముంబాయిలో తన ఇంటికి దగ్గరలో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌కు తరచూ వెళ్లేవారు. అలా శ్రీకృష్ణపరమాత్యుడిపై ఆమెకు భక్తి మొదలయ్యింది. అది మధురభక్తిగా మారింది. వెంటనే బృందావనంలోకి అడుగపెట్టారు. ఆ తర్వాత ఆమె హేమాంగి సఖి అయ్యారు. ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ భగవద్గీత బోధకురాలు హేమాంగి కావడం విశేషం. 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్‌గా ఆమె పట్టాభిషేకం జరిగింది. అఖిల భారతీయ సాధు సమాజ్ ఆమెకు భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదును ఇచ్చి సత్కరించింది.

Updated On 8 April 2024 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story