మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నటుడు సాహిల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు

మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting APP) కేసులో ముంబై సైబర్ సెల్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నటుడు సాహిల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. బాంబే హైకోర్టు సాహిల్ ఖాన్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అత‌డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాహిల్ ఖాన్‌ను సిట్ ఇటీవల ప్రశ్నించింది.

రాష్ట్రంలోని కొన్ని ఆర్థిక, రియల్ ఎస్టేట్ సంస్థలు, వివాదాస్పద మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల మధ్య జరిగిన అక్రమ లావాదేవీలపై సిట్ విచారణ జరుపుతోంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నివేదిక ప్రకారం.. కుంభకోణం రూ.15,000 కోట్లు జ‌రిగింద‌ని తెలుస్తుంది.

సాహిల్ ఖాన్‌తో పాటు మరో 31 మంది వ్యక్తులపై విచారణ జరుగుతోంది. ఈ విచారణలో వారి బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అన్ని సాంకేతిక పరికరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఒకరిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ‘స్టైల్‌’, ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాహిల్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌ నిపుణుడిగా మారాడు.

Updated On 27 April 2024 11:09 PM GMT
Yagnik

Yagnik

Next Story