మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ(ఎమ్వీఏ) కూటములు ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ‘మహా’సంగ్రామంపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికారపగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని తేలింది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145. పీపుల్స్పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 182 (175 -195) సీట్లు, ఎమ్వీఏ కూటమికి 97(85 -112) సీట్లు, ఇతరులుకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్దగా అవతరించే అవకాశాలున్నాట్టు పీపుల్పల్స్ ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. బీజేపీ 113(102 నుండి 120) స్థానాలు, శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ 52 (42 నుండి 61) స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ 17(14 నుండి 25) స్థానాలు, కాంగ్రెస్ 35(24 నుండి 44) స్థానాలు, శివసేన (యూబీటీ) 27(21 నుండి 36) స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 35 (28 నుండి 41) స్థానాలు, ఇతరులు 9 (6 నుండి 12) స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాయుతికి 49.8 శాతం, ఎమ్వీఏ 40.1 శాతం, ఇతరులకు 10.1 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ 31.3 శాతం, శివసేన (షిండే) 14.5 శాతం, ఎన్సీపీ (ఏపీ) 4 శాతం, కాంగ్రెస్ 13.7 శాతం, శివసేన (యూబీటీ) 13 శాతం, ఎన్సీపీ (ఎస్పీ) 10.1 శాతం, ఇతరులు 13.4 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయిని ఎగ్జిట్ పోల్లో తేలింది. ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని ఓటర్లను ప్రశ్నించగా ఏక్నాథ్ శిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7 శాతం, దేవంద్ర ఫడ్నవీస్కు 11.7 శాతం, రాజ్థాక్రేకు 2.9 శాతం, అజిత్ పవార్కు 2.3 శాతం, జయంత్ పాటిల్కు 2.1 శాతం, నానా పాటోల్కు 1.3 శాతం, ప్రకాశ్ అంబేద్కర్కు 1.3 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మహిళలు మద్దతు మహాయుతికే లభించింది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే ముస్లింలు ఎమ్వీకే మద్దతివ్వగా, ఓబీసీలు మహాయుతివైపు మొగ్గు చూపారు. ఎస్సీల్లో రెండు కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. బౌద్దుల మద్దతు రెండు కూటములకు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి. రంగాల వారిగా పరిశీలిస్తే రైతులు, ప్రయివేట్ ఉద్యోగులు, వ్యాపారస్తులు గృహిణులు మహాయుతి వైపు ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్వీఏ వైపు నిలిచారు. మరాఠా, మార్వాడీ, ఉత్తర భారతీయులు, గుజరాతీయులు, దక్షిణ భారత ప్రజలు ఇలా అందరూ మహాయుతికే మద్దతుగా నిలిచారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబాయి రీజియన్లలో మహాయుతి ఆధిపత్యం కనబరిచింది. లోక్సభ ఎన్నికల్లో విదర్భ, ముంబాయి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగ్గయ్యాయి. ఐదు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలతో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పోలిస్తే మహారాష్ట్ర ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహాయుతి కూటమి 17 (43.55%) , ఎమ్వీఏ కూటమి 30 (43.71%) పార్లమెంట్ స్థానాలు సాధించాయి. రెండు పార్టీల మధ్య సీట్లపరంగా 13 స్థానాల వ్యత్యాసం ఉన్నా, ఓట్ల శాతం పరంగా 0.16% మాత్రమే తేడా ఉంది. స్వల్ప వ్యత్యాసంతో భారీగా సీట్లు కోల్పోయిన మహాయుతి అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి మరోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. మరోవైపు బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో మహాయుతి విజయానికి తోడ్ప డింది.

లోక్‌సభ ఎన్నికల్లో మరాఠా రిజర్వేషన్ల అంశంతో పాటు, బీజేపీ నినాదం ‘అబ్ కీ బార్, చార్ సౌ పార్’ వాస్తవం దాలిస్తే రాజ్యాంగానికే ముప్పు అనే ఎమ్వీఏ ప్రచారం మహాయుతికి వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ కూటమి నష్ట పోయింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ముందే జాగ్రత్తపడిన బీజేపీ పలు మరాఠాలు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అంచనాతో ఓబీసీలను అనుకూలంగా మల్చుకుంది. మరోవైపు ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ‘ఓట్ జిహాద్’ చేస్తున్నారని ప్రచారం చేస్తూ ‘బాటేంగే తో కాటేంగే’ నినాదాన్ని ఎత్తుకొని భారీగా హిందువుల ఓట్లను కూడగట్టగలిగింది. ఈ ఎన్నికల్లో దీనికి మించి మరో ముఖ్యాంశం మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహాయుతి ప్రభుత్వం ‘మాజీ లడ్కీ బహిన్ యోజన’ పథకం కింద 2.34 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1500 అందించారు. భవిష్యత్తులో దీన్ని రూ.2100 కోట్లకు పెంచుతామని ప్రకటించారు. ఈ పథకం ఎన్నికల్లో మహాయుతికి సానుకూలంగా పనిచేసింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఎమ్వీఏ లోక్సభ ఎన్నికల తీరులోనే అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్యాంగం పరిరక్షణ అంశాన్ని కీలక ప్రచారాంశంగా మల్చుకుంది. మరోవైపు ఐదు గ్యారెంటీలతో పాటు కులగణన చేపడుతామని ప్రకటించి భారీ ఆశలు పెట్టుకుంది. అయితే దీనికి పోటీగా ‘ఏక్ రహేంగేతో సేఫ్’ అంటూ ప్రధాని మోదీ మొదలుకొని బీజేపీ నేతలంతా ప్రచారం చేశారు. మొత్తం మీద నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన ప్రజా సమస్యల కంటే భావోద్వేగాల అంశాలే ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ఎన్నికల ప్రచారంలో మహాయుతి తరఫున ప్రధానంగా బీజేపీ జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు సుడిగాలిలా పర్యటించగా, కాంగ్రెస్ మాత్రం కొంత వెనుకబ డిం ది. ఎమ్వీఏలో కాంగ్రెస్తో పోలిస్తే శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మరోవైపు పార్టీల మధ్య సీట్ల పంపకాన్ని త్వరగా తేల్చుకోవడంలో మహాయుతితో పోలిస్తే ఎమ్వీఏ కొంచెం వెనుకబ డింది. బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించగా, ఎమ్వీఏ మాత్రం చివరి నిమిషం వరకు సీట్ల సర్దుబాటు దోబుచులాడుతూ నష్టపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ప్రధానంగా ఎంఐఎం, వీబీఏ, బీవీఏ, ఎమ్ఎన్ఎస్ పార్టీలు సీట్లు సాధించడంలో వెనుకబడ్డా ఓట్లను చీల్చడంతో ఇతర పార్టీల గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించాయి. 2019 ఎన్నికల్లో 40 స్థానాలకు పైగా పోటీ చేసి రెండు సీట్లు సాధించిన ఎంఐఎం బీజేపీకి ‘బీ టీం అని అపవాదు ఎదుర్కోవడంతో ఈసారి 16 స్థానాల్లోనే పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి.

ehatv

ehatv

Next Story