సంగం ఒడ్డున మహాకుంభ మహోత్సవం పూర్తయింది. అయితే ఇప్పుడు దాని వ్యయం, ఆర్థిక ప్రయోజనాల గురించి రాజకీయ చర్చ జరుగుతోంది.

సంగం ఒడ్డున మహాకుంభ మహోత్సవం పూర్తయింది. అయితే ఇప్పుడు దాని వ్యయం, ఆర్థిక ప్రయోజనాల గురించి రాజకీయ చర్చ జరుగుతోంది.
మహాకుంభ ఏర్పాట్లు, సౌకర్యాల కోసం యోగి ప్రభుత్వం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మరోవైపు యూపీ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రి అనిల్ రాజ్‌భర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహాకుంభంతో ప్రభుత్వానికి సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని, 60 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ వాదనను 'అంకెల గారడీ'గా పేర్కొంటున్నాయి. అనిల్ రాజ్‌భర్ మాట్లాడుతూ కుంభోత్సవం కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, ఆర్థిక, సాంస్కృతిక పురోభివృద్ధికి కేంద్రమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హోటల్, రవాణా, హస్తకళలు, ఆహార పరిశ్రమ, పర్యాటక రంగాల్లో విపరీతమైన అభివృద్ధి వచ్చిందని, దీని ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించిందని అన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు యూపీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య వంటి నగరాల్లో హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు నిండిపోయాయి. ఈ సమయంలో ప్రజలు చాలా సంపాదించారు.
