హిందూ క్యాలెండర్(Hindu Calendar) ప్రకారం మాఘ మాసం సంవత్సరంలో 11వ నెల. ప్రతి నెలలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమిలు(Full moon) వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి సనాతన ధర్మంలో(Sanatana Dharma) విశేష ప్రాధాన్యం ఉంది. మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘీ పూర్ణిమ(Maghi Purnima) అని కూడా అంటారు.
హిందూ క్యాలెండర్(Hindu Calendar) ప్రకారం మాఘ మాసం సంవత్సరంలో 11వ నెల. ప్రతి నెలలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణమిలు(Full moon) వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి సనాతన ధర్మంలో(Sanatana Dharma) విశేష ప్రాధాన్యం ఉంది. మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘీ పూర్ణిమ(Maghi Purnima) అని కూడా అంటారు.
ఈరోజు సముద్రస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే
బ్రహ్మ ముహూర్తంలో జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహా పాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని అర్థం. మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? శుభ ముహూర్తం ఎప్పుడు? మాఘ పూర్ణిమ విశిష్టత, పూజా విధానం వంటి వివరాలు తెలుసుకుందాం.
అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలగించేది గనుకనే మాఘ మాసానికి, మాఘ పౌర్ణమికి(Magha Purnima) ప్రాధాన్యం లభించింది. మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రీ మహా విష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్య నదుల్లో గానీ, సముద్రంలో గానీ, వారి గృహాల్లో గంగా జలంతో శ్రీమహావిష్ణువును, గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి.. శ్రీమన్నారాయణుడిని, సూర్య భగవానుడిని, గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి.. పుణ్యం కలుగుతుందని మాఘ పురాణం తెలియజేస్తోంది. మాఘ పూర్ణిమ తేదీ, శుభ ముహూర్తం: మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 03.33 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న సాయంత్రం 05.59 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 అంటే శనివారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకోవచ్చు.
దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ
అని పఠించి మౌనంగా స్నానం చేయాలి, అంటే దుఃఖం, దారిద్ర్యం, పాపం నశించడానికి ఈ పవిత్ర మాఘ స్నానం చేయుచున్నానని అర్థం. అందుకే ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు అని అర్థం.