తమిళనాడు విద్యాశాఖ మంత్రి(Education Minister), ఆయన భార్యకు(Wife) గురువారం మద్రాస్ హైకోర్టు(Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో మంత్రి దంపతులకు కోర్టు ఈ శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.50 లక్షల చొప్పున ఇద్దరూ జరిమానా కూడా చెల్లించాలని తీర్పు వెలువరించింది.

2006 సంవత్సరం నుంచి 2011 వరకు ఖనిజశాఖ మంత్రిగా ఉన్న పొన్ముడి కోట్ల విలువైన అక్రమాస్తులను సంపాదించుకున్నారన్న కేసులో మద్రాస్ హైకోర్టు మంత్రి పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షిలను(Vishalakshi) డెసెంబర్ 19న దోషులుగా తేల్చింది. ఈ కేసులో గురువారం దంపతులిద్దరికీ మూడేళ్ల జైలు, ఒక్కొక్కొరికి రూ.50 లక్షలు జరిమానా విధించింది. పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు దంపతులిద్దరికీ 30 రోజుల గడువు విధించింది. అనారోగ్య కారణాలు చూపుతూ మినహాయింపు కోరినా కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో వీరిని నిర్దోషులుగా తేలుస్తూ 2016లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఆగస్ట్‌లో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పొన్ముడి దంపతులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు.