ఇళయరాజా(Ilayaraja) అద్భుతమైన సంగీత దర్శకుడు. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. ఓ తరం సంగీత ప్రియులను తన ముగ్ధ మనోహర సంగీతంతో అలరించారు. ఆయన పాటల వల్లే సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పలు భాషలలో వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఇళయరాజా(Ilayaraja) అద్భుతమైన సంగీత దర్శకుడు. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. ఓ తరం సంగీత ప్రియులను తన ముగ్ధ మనోహర సంగీతంతో అలరించారు. ఆయన పాటల వల్లే సినిమాలు విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పలు భాషలలో వెయ్యికిపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన గొప్పవారే కానీ అందరికంటే గొప్పవారేం కాదని మద్రాస్‌ హైకోర్టు(Madras high Court) న్యాయమూర్తి అన్నారు. ఇందుకు పూర్వాపరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం! ఇళయరాజా పాటలను వాడుకునే ఒప్పందం గడువు పూర్తి అయ్యిందని ఏకో రికార్డింగ్‌(Eco Recording) తదితర సంస్థలపై ఇళయరాజా కాపీ హక్కులను కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆ సంస్థలు కూడా చెన్నై హైకోర్టు రిట్‌ పిటిషన్ వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇళయరాజా పాటను ఉపయోగించుకునే హక్కు ఆ రికార్డింగ్‌ సంస్థలకు ఉందని తీర్పు చెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా తరఫున మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 10వ తేదీన న్యాయమూర్తులు ఆర్‌.మహాదేవన్, మహ్మద్‌ షఫీక్‌ సమక్షంలో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది ఏమన్నారంటే .. సంగీత దర్శకుడు ఇళయరాజా అందరికంటే గొప్పవారని వాదించారు. ఆయన అలా అనగానే న్యాయమూర్తి ఆర్‌.మహాదేవన్‌ కల్పించుకున్నారు. 'సంగీత త్రిమూర్తులుగా ఉన్న సంగీత దర్శకులు ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి అందరి కంటే గొప్పవారు. ఇళయరాజా అంతకంటే గొప్పవారేం కాదు. మీ వాదనను మేము అంగీకరించలేము' అని అన్నారు. తర్వాత ఈ కేసు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

Updated On 19 April 2024 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story