దేవాలయాల్లోకి(Temples) హిందూయేతర వ్యక్తులు ప్రవేశించవచ్చా? కూడదా? అన్న మీమాంస ఉన్నది. కొన్ని గుళ్లల్లోకి ఇతర మతస్తులను అనుమతించరుగాక అనుమతించరు. అయితే ఆలయాలలో హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు(Madras High court) సంచలన తీర్పు వచ్చింది. ఆలయాలన్నింటిల్లో హిందూయేతర(Non-Hindu) మతాలకు చెందిన వ్యక్తులను ఆయల ప్రవేశాల దగ్గర ఉండే ధ్వజస్తంభం దాటి అనుమతించకూడదని, ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయశాఖను మంగళవారం ఆదేశించింది.
దేవాలయాల్లోకి(Temples) హిందూయేతర వ్యక్తులు ప్రవేశించవచ్చా? కూడదా? అన్న మీమాంస ఉన్నది. కొన్ని గుళ్లల్లోకి ఇతర మతస్తులను అనుమతించరుగాక అనుమతించరు. అయితే ఆలయాలలో హిందూయేతర వ్యక్తుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు(Madras High court) సంచలన తీర్పు వచ్చింది. ఆలయాలన్నింటిల్లో హిందూయేతర(Non-Hindu) మతాలకు చెందిన వ్యక్తులను ఆయల ప్రవేశాల దగ్గర ఉండే ధ్వజస్తంభం దాటి అనుమతించకూడదని, ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయశాఖను మంగళవారం ఆదేశించింది. దీంతో పాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయాలు పిక్‌నిక్ స్పాట్‌లు కాదని, హిందువులకు తమ మతాన్ని విశ్వసించే, ఆచరించే ప్రాథమిక హక్కు ఉన్నదని, అందుకు భంగం వాటిల్లకూడదని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తెలిపింది. డి. సెంథిల్ కుమార్(Senthil Kumar) అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎస్.శ్రీమతి విచారణ జరిపి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లో హిందువులను మాత్రమే ప్రవేశాన్ని అనుమతించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ సెంథిల్ ఈ పిటిషన్ వేశారు. ఆ మేరకు ఆలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆయన విన్నవించుకున్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు హిందూ మతం పట్ల విశ్వాసం లేని వారిని ఆలయాల్లోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా హిందూయేతర వ్యక్తి వస్తే అధికారులు తనకు సదరు దేవతామూర్తి పట్ల విశ్వాసం ఉన్నదని, హిందూ మత, ఆలయ పద్ధతులను పాటిస్తానని పేర్కొంటూ అండర్‌టేకింగ్ తీసుకోవాలని తెలిపింది. అధికారులు కూడా దీనిపై రిజిస్టర్ నిర్వహించాలని సూచించింది.