పులుల(TIgers) గణన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 785 పులులతో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. త‌ద్వారా మధ్యప్రదేశ్ తన టైగర్ స్టేట్ హోదాతో దూసుకుపోతుంది. 563 పులులతో కర్ణాటక(Karnataka) రెండో స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) 560, మహారాష్ట్రలో(Maharastra) 444 పులులు ఉన్నాయి. పులుల గణన-2022 రాష్ట్రాల‌ వారీ గణాంకాలను కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్(Bhupendra Yadav) శనివారం విడుదల చేశారు.

పులుల(Tigers) గణన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 785 పులులతో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) అగ్రస్థానంలో నిలిచింది. త‌ద్వారా మధ్యప్రదేశ్ తన టైగర్ స్టేట్ హోదాతో దూసుకుపోతుంది. 563 పులులతో కర్ణాటక(Karnataka) రెండో స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) 560, మహారాష్ట్రలో(Maharastra) 444 పులులు ఉన్నాయి. పులుల గణన-2022 రాష్ట్రాల‌ వారీ గణాంకాలను కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్(Bhupendra Yadav) శనివారం విడుదల చేశారు. అటవీ శాఖ మంత్రి ట్వీట్ ద్వారా మధ్యప్రదేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

భూపేంద్ర యాదవ్ ట్వీట్‌లో 'మధ్యప్రదేశ్‌కు అభినందనలు! కొత్త పులుల గణన డేటాలో 785 పులులతో మధ్యప్రదేశ్ దేశంలోనే అత్యధిక పులులు ఉన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. పులుల సంరక్షణలో మధ్యప్రదేశ్‌కు ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోంది. స్థానిక కమ్యూనిటీ భాగస్వామ్యంతో ఇంటెన్సివ్ కన్సర్వేషన్, మానిటరింగ్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని రాసుకొచ్చారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivaraj Singh Chouhan) బ‌దులిస్తూ.. రాష్ట్ర ప్రజల సహకారం, అటవీ శాఖ అలుపెరగని కృషి ఫలితంగా రాష్ట్రంలో పులుల సంఖ్య 526 నుంచి 785కి పెరగడం సంతోషించదగ్గ విషయమన్నారు. నాలుగు సంవత్సరాలలో అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో సహకరించినందుకు మొత్తం రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మనమందరం కలిసి భవిష్యత్ తరాలకు ఉప‌యోగ‌ప‌డేవిధంగా ప్రకృతిని సంరక్షించేందుకు ప్రతిజ్ఞ చేద్దామ‌ని రాసుకొచ్చారు.

పులుల సంరక్షణ ప్రయత్నాలు 2006లో వేగవంతం చేయబడ్డాయి. అప్పటి నుంచి పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2006లో 300 పులులతో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. దీని తర్వాత 2010లో అది 257కి తగ్గింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ హోదాను కర్ణాటక లాక్కుంది. మధ్యప్రదేశ్‌లో 2014లో 308 పులులు, 2018లో 526 పులులు ఉన్నాయి. 2018లో రెండు పులుల తేడాతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క చేతిలో టైగ‌ర్ స్టేట్ హోదాను కోల్పోట‌యింది. నాలుగేళ్లలో రాష్ట్రంలో 259 పులులు పెరగగా.. కర్ణాటకలో 39 పులులు మాత్రమే పెరిగాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, కర్ణాటక మధ్య వ్యత్యాసం 2018 లో రెండు పులుల నుండి 2022 నాటికి 222 కి పెరిగింది.

2006లో దేశంలో 1,411 పులులు ఉండేవి. దీని తర్వాత 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,682 పులులు ఉన్నాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ పులుల సంఖ్య పెరుగుదల నమోదవుతోంది.

Updated On 29 July 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story