పాము(Snake) అడుగుదూరంలో ఉంటేనే దడుసుకుంటాం! అలాంటిది దాన్ని పట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి? పట్టుకోవడం అటుంచి, దాని నోట్లో నోరు పెట్టడానికి పెద్ద పెద్ద తోపుల వల్ల కూడా కాదు. కానీ మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్(Police Constable) ఏ మాత్రం బెరుకు లేకుండా ఆ పని చేశాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. పోలీసు కానిస్టేబుల్ అతుల్‌శర్మ(Atul Sharma) ఇప్పటి వరకు కనీసం అయిదు వందల పాములను రక్షించారు.
పాము(Snake) అడుగుదూరంలో ఉంటేనే దడుసుకుంటాం! అలాంటిది దాన్ని పట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి? పట్టుకోవడం అటుంచి, దాని నోట్లో నోరు పెట్టడానికి పెద్ద పెద్ద తోపుల వల్ల కూడా కాదు. కానీ మధ్యప్రదేశ్‌కు(Madhya Pradesh) చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్(Police Constable) ఏ మాత్రం బెరుకు లేకుండా ఆ పని చేశాడు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. పోలీసు కానిస్టేబుల్ అతుల్‌శర్మ(Atul Sharma) ఇప్పటి వరకు కనీసం అయిదు వందల పాములను రక్షించారు. పాములను పట్టుకోవడంలో నేర్పరి. డిస్కవరీ ఛానెల్(Discovery Channel) చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. సెమ్రీ హర్‌చంద్‌లోని తవా కాలనీలో పాము ఉన్నట్టు ఆయనకు సమాచారం వచ్చింది. నీటి పైపులైన్‌లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానికి బయటకు తేవడానికి పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్‌లో వేశారు. దాంతో ఆ పాము కాస్తా అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ పామును బతికించుకోవడానికి అతుల్ శర్మ దానికి సీపీఆర్ ఇచ్చారు. అంటే పాము నోట్లో నోరు పెట్టి ఊపిరి ఇచ్చారు. పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్(CPR) ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అతుల్‌శర్మ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.