క్రెడిట్ కార్డు(Credit Card), డెబిట్ కార్డులతోనే(Debit card) కాదు, చివరాఖరికి పాన్‌కార్డుతో కూడా డబ్బులు నొక్కేస్తున్నారు కేటుగాళ్లు. అది కూడా మనకు తెలియకుండానే! మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) గ్వాలియర్(Gwaliar) జిల్లాలో ఓ కాలేజీ స్టూడెంట్‌కు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.
క్రెడిట్ కార్డు(Credit Card), డెబిట్ కార్డులతోనే(Debit card) కాదు, చివరాఖరికి పాన్‌కార్డుతో కూడా డబ్బులు నొక్కేస్తున్నారు కేటుగాళ్లు. అది కూడా మనకు తెలియకుండానే! మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) గ్వాలియర్(Gwaliar) జిల్లాలో ఓ కాలేజీ స్టూడెంట్‌కు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. 46 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలంటూ ఇన్‌కమ్‌ట్యాక్స్ నుంచి నోటీసు వచ్చింది. వేసుకునే కోటు కూడా లేని తనదగ్గర అన్నేసి డబ్బులు ఎందుకుంటాయని కంగారుపడ్డాడా ప్రమోద్‌కుమార్ దండోటియా అనే పిల్లోడు. అలా ఎందుకు జరిగిందో ఆరా తీశాడు. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతా నుంచి 46 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబాయి, ఢిల్లీ ప్రాంతాలలో2021లో తన పాన్‌కార్డు నంబర్‌తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్టు పేర్కొన్నాడు. తన పాన్‌కార్డు దుర్వినియోగం అయ్యిందని చెప్పాడు. ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడానని ప్రమోద్‌కుమార్ దండోటియా చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఈసారి అడిషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో కంప్లయింట్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్టు ఎసీపీ తెలిపింది.