మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని సిద్ధి జిల్లా(Sidhi District)లో గిరిజనుడైన దశమత్ రావత్‌(Dashmat Rawat)పై బీజేపీ కార్యకర్త మూత్ర విసర్జన చేసిన ఘటనతో అక్క‌డి రాజకీయాలు వేడెక్కాయి. గురువారం బాధితుడు దశమత్ రావత్.. భోపాల్ ముఖ్యమంత్రి(Bhopal CM) నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ దశమత్‌కు సీఎం శివరాజ్‌(Shivraj Singh Chouhan)పాదాలు కడిగి శాలువా కప్పి సత్కరించారు. మనసు బాధగా ఉందని సీఎం శివరాజ్ అన్నారు. నాకు ప్రజలే దేవుళ్ల‌ని పేర్కొన్నారు.

బాధితుడితో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. పిల్లలు చదువుకుంటున్నారా? స్కాలర్‌షిప్ పొందారా? ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండని వివ‌రాలు అడిగి తెలుసుకుని భ‌రోసా ఇచ్చారు. దశమత్ పుల్లర్ గా పనిచేస్తానని సీఎంకు చెప్పారు. తనకు చాలా బాధగా ఉందని ముఖ్యమంత్రి బాధితురాడితో అన్నారు. నన్ను క్షమించండి నాకు పబ్లిక్ అంటే దేవుడితో స‌మానం. దశమత్ ను సుదామా అని పిలిచిన సీఎం.. నువ్వు ఇప్పుడు నా స్నేహితుడివి అని అన్నారు.

దశమత్ రావత్‌పై బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా(Pravesh Shukla) మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేడెక్కింది. దీనిపై విచారణకు బీజేపీ(BJP), కాంగ్రెస్‌(Congress)లు విచారణ కమిటీలను ఏర్పాటు చేశాయి. ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ఘ‌ట‌న‌పై పోలీసులు ప్రవేశ్ శుక్లాను మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో అరెస్టు చేశారు. ప్రత్యక్ష మూత్ర విసర్జన ఘటనపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం మాట్లాడుతూ.. ఈ చర్య చాలా అసహ్యకరమైనది.. ఖండించదగినదిగా అభివర్ణించారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం, చట్టబద్ధమైన‌ పాలన ఉంటుందన్నారు.

Updated On 6 July 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story